SP Balasubrahmanyam passes away: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మనకు ఇక లేరు. దేశం గర్వించదగిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో కన్నుమూశారు ( SPB dies). కరోనా సోకిన అనంతరం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన... అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేలకు పైగా పాటలు పాడిన గాయకుడిగా ఆయన కోట్లాది హృదయాలను గెల్చుకున్నారు. Also read : SPB live updates: బాలు కోసం ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న కుటుంబం, కమల్ హాసన్
కరోనా సోకిన అనంతరం ఆగస్టు 5న కొవిడ్-19 చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిన అనంతరం ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే నయమవుతోంది అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ అనారోగ్యం బారినపడటంతో ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా నుంచి బయటపడినట్టుగానే ఈ అనారోగ్య సమస్యల నుంచి కూడా కోలుకుంటారని బాలు కుటుంబసభ్యులు, అభిమానులు ఆశించారు. కానీ కోట్లాది మంది ప్రార్థనలు ఫలించలేదు. బాలు ఆరోగ్యం మరింత క్షీణించింది. గురువారం సాయంత్రమే బాలు ఆరోగ్యం చేయిదాటిపోయినట్టు తెలిసింది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. దీంతో బాలు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. Also read : SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు
ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన బాలు హెల్త్ బులెటిన్ ( SPB Health bulletin ) చూడటంతోనే బాలు అభిమానుల గుండెల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఎక్కువైంది. ఏదైతే జరగకూడదని బాలు అభిమానులు అంతా ప్రార్థించారో.. చివరకు అదే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. Also read : Salman Khan About SP Balu: ఎస్పీ బాలు సార్.. మీ పాటలు నాకెంతో ప్రత్యేకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe