SP Charan-Sonia Agarwal Marriage :ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఎస్పీ చరణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం తెచ్చుకున్న అంత పేరు తెచ్చుకో లేకపోయాడు కానీ ఎస్పీ చరణ్ కూడా కాస్తోకూస్తో తన పేరిట కొన్ని మంచి సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోగలిగాడు. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎస్పీ చరణ్ లైఫ్ అంత ఏమీ బాగాలేదు. అయితే ఇప్పుడు ఆయన మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగగా, అయితే ఆ విషయం మీద తాజాగా క్లారిటీ లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ కూడా తండ్రి లాగానే గాయకుడినవ్వాలని భావించారు. అందులో భాగంగానే సంగీతంలో శిక్షణ తీసుకుని గాయకుడిగా మారారు. కానీ ఎస్పీ బాలసుబ్రమణ్యం దక్కించుకున్న అంత పేరు ప్రతిష్టలు అయితే దక్కించుకోలేకపోయారు. దీంతో తండ్రి సంపాదించిన ఆస్తితో పాటు ఆయన పేరును కూడా మరింత పెంచే ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగానే ప్రస్తుతానికి పాడుతా తీయగా కార్యక్రమానికి సంబంధించిన ఒక సీక్వెల్ కార్యక్రమాన్ని ఈటీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన నిర్మాతగా కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు.


అసలు విషయం ఏమిటంటే తాజాగా నటి సోనియా అగర్వాల్ తో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఒక కొత్త ప్రారంభం అర్థం వచ్చేలా పేర్కొనడంతో ఆయన మూడో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఎస్పీ చరణ్ రెండు వివాహాలు కూడా విభేదాల కారణంగా విఫలమయ్యాయి. సోనియా అగర్వాల్ కూడా దర్శకుడు సెల్వరాఘవన్ ను వివాహం చేసుకుని చాలా కాలం తర్వాత విడాకులు తీసుకోవడంతో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది.


దీంతో విషయం గ్రహించిన ఎస్పీ చరణ్‌ దీనికి కౌంటర్‌గా మరో ఫోటోని షేర్ చేయగా అందులో చరణ్‌తోపాటు సోనియా అగర్వాల్‌,  అంజలి,  పక్కన మరో నటుడు కనిపిస్తున్నారు. అందులోనే కొత్తగా వెబ్‌ సిరీస్‌ లాంచ్‌ చేయబోతున్నట్టు తెలిపి పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. అసలు విషయం ఏమిటంటే ఎస్పీ చరణ్ నిర్మాతగా సోనియా అగర్వాల్ కీలక పాత్రలో ఒక వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దిగిన ఫోటో పోస్ట్ చేయడంతో వారిద్దరికీ పెళ్లి అంటూ కొత్త ప్రచారం మొదలైంది,  అందుకే ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. 


Also Read: భారీగా త‌గ్గిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' టిక్కెట్ రేట్లు.. అభిమానులకు పండగే! ముఖ్య అతిథిగా చిరంజీవి


Also Read: Dj Tillu Launched: టిల్లు గాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు..షూట్ ఎప్పటి నుంచంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.