భారీగా త‌గ్గిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' టిక్కెట్ రేట్లు.. అభిమానులకు పండగే! ముఖ్య అతిథిగా చిరంజీవి

భారీగా త‌గ్గిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' టిక్కెట్ రేట్లు అభిమానులకు పండగే ముఖ్య అతిథిగా చిరంజీవి

Written by - P Sampath Kumar | Last Updated : Jun 25, 2022, 03:54 PM IST
  • భారీగా త‌గ్గిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' టిక్కెట్ రేట్లు
  • అభిమానులకు పండగే
  • ముఖ్య అతిథిగా చిరంజీవి
భారీగా త‌గ్గిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' టిక్కెట్ రేట్లు.. అభిమానులకు పండగే! ముఖ్య అతిథిగా చిరంజీవి

Pakka Commercial Ticket Prices in AP and Telangana: మ్యాచో స్టార్ గోపిచంద్‌ గ‌త కొంత కాలంగా సరైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా హిట్ కొట్టాలని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి దర్శకత్వంలో సినిమా చేశాడు. గోపిచంద్‌, మారుతి కాంబోలో తెరకెక్కిన సినిమా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్'. రాశీ ఖ‌న్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మేక‌ర్స్ సినీ అభిమానులకు ఓ శుభవార్త అందించారు. 

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా టిక్కెట్ రేట్ల‌ను తాజాగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌ రాష్ట్రంలో సింగిల్ థియేట‌ర్‌లో ఒక్కో టికెట్ ధర రూ.100 కాగా..  మ‌ల్టీప్లెక్స్‌లో రూ.160గా ఉండునుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ థియేట‌ర్‌లో రూ.100 కాగా.. మ‌ల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉండ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇటీవలి కాలంలో ఇంత త‌క్కువ టిక్కెట్ రేట్ల‌తో ఏ సినిమా విడుద‌ల కాలేదు. దాంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను యూవీ క్ర‌యేష‌న్స్‌, జీఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ల‌పై బ‌న్నివాస్‌, వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌, అన‌సూయ‌ భరద్వాజ్, రావు ర‌మేష్, శ్రీనివాస్ రెడ్డి కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. గోపిచంద్‌, మారుతి కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు.

Also Read: India Vs Ireland: వికెట్‌ కీపర్‌గా సంజూ, ఇషాన్‌ వద్దు.. అతడే సరైనోడు: గవాస్కర్

Also Read: Rashmika Mandanna Responds : కుక్కకి టికెట్ల వార్తపై రష్మిక స్పందన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News