Dj Tillu Launched: టిల్లు గాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు..షూట్ ఎప్పటి నుంచంటే?

Dj Tillu Sequel Launched :  సిద్ధు జొన్నలగడ్డ,  నేహా శెట్టి హీరోహీరోయిన్‌లుగా వచ్చిన చిత్రం 'డీజే టిల్లు' ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  తాజాగా ఈ సినిమా సీక్వెల్ లాంచనంగా ప్రారంభమైంది. 

Last Updated : Jun 25, 2022, 03:15 PM IST
  • సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్‌లుగా 'డీజే టిల్లు'
  • లాంచనంగా ప్రారంభమైన సీక్వెల్
  • ఆగస్టు నుంచి షూటింగ్
Dj Tillu Launched: టిల్లు గాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు..షూట్ ఎప్పటి నుంచంటే?

Dj Tillu Sequel Launched : సిద్ధు జొన్నలగడ్డ,  నేహా శెట్టి హీరోహీరోయిన్‌లుగా వచ్చిన చిత్రం 'డీజే టిల్లు' ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. డీజే టిల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,  సాంగ్స్,  ట్రైలర్‌ అందరిని ఆకట్టుకోవడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన సినిమా అందరినీ ఆకట్టుకుంది. 

ఆకట్టుకోవడమే కాక బంపర్ హిట్ కూడా కొట్టింది. థియేటర్లలో టిల్లుగాడి లొల్లికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాకు యువత బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాసలో సిద్ధు చెప్పే డైలాగ్స్,  నేహా శెట్టి అందం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక సినిమాలో రామ్ మిరియాల పాడిన డీజే టిల్లు సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను శ్రీచరణ్‌ పాకాలతో కలిసి రామ్‌ మిర్యాల స్వరాలు అందించారు. 

థమన్ నేపథ్య సంగీతం కూడా సూట్ కావడంతో,  అన్ని అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు హిట్ టాక్ తెచ్చుకుంది.  ఇక ఈ సినిమా మార్చి 4న నుంచి స్ట్రీమింగ్​ అవుతుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మొదటి భాగంలో హింట్ ఇచ్చారు. ఇక తాజాగా ఆ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుందని అంటున్నారు. మొదటి భాగంలో ఉన్న నటీనటులను కధా ప్రకారం రిపీట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

Also Read:Rashmika Mandanna Responds : కుక్కకి టికెట్ల వార్తపై రష్మిక స్పందన.. దానికి ఇష్టం లేదట!

Also Read:Kiara Advani: సారీ చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు.. నాకు ప్రేమే ముఖ్యం: కియారా అడ్వాణీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News