గూగుల్... ఆన్‌లైన్ సామ్రాజ్యానికే రారాజు
గూగుల్.. ఈ మాట వింటే చాలు.. మనకు అంతర్జాలంలో ఒక అన్వేషణకు మార్గం సుగమం అయినట్లే. ఏ సమాచారాన్నైనా చిటికెలో మనకు అందిస్తూ, మన జీవితాన్ని సులభతరం చేసిన గూగుల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతర్జాల సెర్చ్ ఇంజిన్ మాధ్యమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గూగుల్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు మీ కోసం ప్రత్యేకం..!
1.1998లో ల్యారీపేజ్ మరియు సెర్జే బ్రిన్ అనే ఇద్దరు స్నేహితులకు వచ్చిన ఆలోచనే గూగుల్ అనే అంతర్జాల సంస్థను ప్రారంభించడానికి నాంది పలికింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ ప్రాజెక్టుగా గూగుల్‌ను స్థాపించాలన్న ఐడియాకు అంకురార్పణ చేసిన ఈ ఇద్దరు స్నేహితులు... తాము ప్రారంభించిన సంస్థ ఒకరోజు అంతర్జాల సామ్రాజ్యాన్నే శాసిస్తుందని ఊహించలేదేమో ..!
2. అంతర్జాలంలో సెర్చ్ ఇంజిన్ వ్యవస్థ బలం పుంజుకున్నాక, గూగుల్‌కు పోటీగా ఎన్నో కంపెనీలు తయారయ్యాయి. అయినే గూగుల్ స్థానం జనులకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే.
3.ఒక సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైనా, అంతర్జాల సామ్రాజ్యంలో గూగుల్ నేడు అనేక సేవలను అందిస్తూ.. బాగా విస్తరించింది, జీమెయిల్, గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ యాడ్ సెన్స్, గూగుల్ యాప్స్, గూగుల్ అనాలటిక్స్, గూగుల్ యాడ్ వర్డ్స్,గూగుల్ బుక్స్, యూట్యూబ్, బ్లాగర్, గూగుల్ మ్యాప్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో..
4.ఈ రోజు అంతర్జాల మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న తిరుగులేని దిగ్గజం గూగుల్.
5.నేడు ఇంటర్నెట్‌ని వాడే ప్రతీ వ్యక్తితో గూగుల్‌కి ఏదో ఒక అవినాభావ సంబంధం ఉండనే ఉంటుంది. ఒక బ్రౌజర్ యాక్సెస్ చేయడం దగ్గర నుండీ మెయిల్స్ చెక్ చేసుకోవడం, బ్లాగింగ్ చేయడం, వీడియోలు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం, మ్యాప్స్ ద్వారా ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..
6.అంతర్జాల దిగ్గజంగా పేరు గాంచిన గూగుల్‌కు వస్తున్న ఆదాయం అంతా ఇంతా కాదు.. అందుకే కేవలం ఆన్‌లైన్ ఉత్పత్తులకు మాత్రమే కూడా ప్రత్యామ్నాయ రంగాల్లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది ఈ వ్యాపార దిగ్గజం. ఆటోమొబైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టి గూగుల్ డ్రైవ్ లెస్ కార్ తయారీ కోసం ప్రయోగాలు చేస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే.. గూగుల్ లేనిదే.. నేడు అంతర్జాల ప్రపంచమనేదే లేదు.. స్మార్ట్ యుగంలో వినియోగదారులు గూగుల్ సేవలు పొందకుండా ఉండలేరన్నది సిసలైన సత్యం.