Sravana Bhargavi Deletes controversial video: గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన శ్రావణ భార్గవి ఎట్టకేలకు వివాదానికి కారణమైన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించింది. కొద్దిరోజుల క్రితం శ్రావణ భార్గవి అన్నమాచార్య కీర్తనలలో అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యులు స్వామి వారిని కీర్తించడానికి వాడిన ఒక కీర్తనను రీమిక్స్ చేసి చేసిన కవర్ పాట వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్ లోడ్ చేశారు. ఈ పాటలో ఆమె కనిపించడం పర్వాలేదు కానీ ఆమె అభినయం చేసిన విధానమే  సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.  "ఒకపరి కొకపరి కొయ్యారమై, మొఖమున కళలెల్ల మొలచినట్లుండెగ" అంటూ సాగుతున్న ఆ కీర్తనను తాను అభినయిస్తూ ఒక వీడియో షూట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసింది శ్రావణ భార్గవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె విడుదల చేసిన వెంటనే ఈ వీడియో వివాదానికి కారణమైంది. ఈ పాటను పెద్ద తిరుమలాచార్యులు శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తుండగా స్వామి కనిపించిన విధానానికి అనుగుణంగా ఆయనను ఊహించుకుంటూ అన్నమాచార్యులు రచించారని చెబుతున్నారు. అటువంటి కీర్తనను ఆలయంలో భక్తితోనో లేదా ఇంట్లో దేవుడి ముందో పాడితే బాగుంటుంది కానీ, ఏవో తింటూ కాళ్లు చూపిస్తూ వీడియో చేయడంతో అది కీర్తనను, అన్నమాచార్యులు, హిందువులను సైతం అపహాస్యం చేస్తున్నట్లుగా ఉందని విమర్శలు వచ్చాయి. అన్నమాచార్య వంశస్థులు సహా అనేకమంది ఆమెను ప్రశ్నించినా  ఆమె వీడియో డిలీట్ చేసేది లేదంటూ ముందు నుంచి చెబుతూ వచ్చింది.


అయితే ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉండడంతో ఎట్టకేలకు ఆమె వీడియోని తన ఛానల్ నుంచి తీసేస్తున్నట్లుగా ప్రకటించింది. తన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ  ఎంటర్టైన్మెంట్, మనస్సాంతి అందిస్తూ వచ్చిందని తనకు ఎప్పుడూ కాంట్రవర్సీస్ అంటే ఇష్టం లేదని పేర్కొంది. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పుడు నెగెటివిటీని ఎంకరేజ్ చేయలేదని అందుకే ఇప్పుడు కూడా ఆ వీడియో విషయంలో వెనక్కు తగ్గుతున్నానని ప్రకటించింది.


అన్నమాచార్య గారి మీద ఉన్న గౌరవంతో ఆ వీడియోకి ఉన్న ఆడియో తీసేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే ఒక వీడియో చేయడానికి గంటల సమయం పడుతుందని ఎంతో శ్రమించి వీడియో చేస్తాం కాబట్టి ఆ వీడియో ఉంచి దాని ఆడియో మారుస్తామని ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే ఆమె ఇంస్టాగ్రామ్ లో అలా పేర్కొన్నారు కానీ యూట్యూబ్ లో అయితే వీడియో కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదు.  ఇక ఈ విషయం మీద జీ తెలుగు న్యూస్ ఛానల్ రెండు రోజులు పాటు డిబేట్స్ నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. 


Also Read: Sravana Bhargavi: క్షమాపణలు చెప్పకుంటే నో ఎంట్రీ.. షాకిచ్చిన లోకల్స్!


Also Read: Ananya Nagalla: చిన్నగౌనులో పెద్ద పాప అనన్య నాగళ్ల.. ఇదేం అరాచకం.. ఫోటోలు చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook