Sravana Bhargavi: క్షమాపణలు చెప్పకుంటే నో ఎంట్రీ.. షాకిచ్చిన లోకల్స్!

Police Complaint on Singer Sravana Bhargavi: తాజాగా శ్రావణ భార్గవి పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆమె క్షమాపణలు చెప్పాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు. 

Last Updated : Jul 23, 2022, 04:28 PM IST
  • శ్రావణ భార్గవికి షాక్
  • తిరుపతి వాసులు హెచ్చరిక
  • పోలీసులకు ఫిర్యాదు
Sravana Bhargavi: క్షమాపణలు చెప్పకుంటే నో ఎంట్రీ.. షాకిచ్చిన లోకల్స్!

Police Complaint on Singer Sravana Bhargavi: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటుందని ఒక రకమైన ప్రచారం మొదలు కాగా దాని మీద ఆమె ఆసక్తికరంగా స్పందించింది. ఆ తర్వాత ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో విడుదల చేయగా అది వివాదానికి కారణమైంది. ఒకపరి ఒకపరి వయ్యారమై అంటూ సాగే అన్నమయ్య సంకీర్తనకు శ్రావణ భార్గవి అభినయించి ఒక వీడియో విడుదల చేసింది.

అందులో ఆమె తన పాదాలను చూపిస్తూ ఆ తన అందాలను వర్ణించే విధంగా ఉన్నట్లు భ్రమింప చేయడంతో అది కరెక్ట్ కాదంటూ అనేకమంది ఖండిస్తున్నారు. అంతేకాక ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ అన్నమయ్య కీర్తనలతో చేసిన వీడియో తొలగించాలని కోరుతూ తాళ్లపాక అన్నమాచార్య వంశీయులు ఆమెకు ఫోన్ చేయగా అందులో కూడా తాను డిలీట్ చేసే ఉద్దేశమే లేదంటూ ఆమె పేర్కొన్న వ్యవహారం హాట్ టాపిక్ ఆ మారింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రావణ భార్గవి పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆమె క్షమాపణలు చెప్పాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు. ఆమె చేసిన పనితో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పి సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆమె క్షమాపణలు చెప్పకపోతే కనుక ఇక మీదట తిరుమల దర్శనానికి కూడా ఆమెను వెళ్ళనిచ్చేదే లేదని హెచ్చరించారు.

అంతేకాక ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా స్పందించకపోవడం ఏమాత్రం బాలేదని ఇక మీదట అన్నమయ్య కీర్తనలను ఎవరు తప్పుగా చిత్రీకరించి ఇలా వివాదాస్పదం చేయకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాల్సి ఉంది.

Also Read: Arjun Sarja: ఆ విషాదాలు మరువక ముందే అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం!

Also Read:  Pushpa 2: పుష్ప 2కి కొత్త ఇబ్బందులు.. ఇప్పుడేం చేస్తారో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News