Sri Reddy Sensational Comments on Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాను చదువుకున్న నరసాపురం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. కేవలం మెగాస్టార్ చిరంజీవి అతిధిగా హాజరవ్వడం కోసమే నరసాపురంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన గత అనుభవాలు చెబుతూనే రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయాల్లో రాణించాలి అంటే చాలా రాటు తేలి ఉండాలని అనడానికైనా అనిపించుకోవడానికి అయినా సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు తాను అంతగా అక్కడ రాణించలేకపోయాను గాని పవన్ కళ్యాణ్ మాత్రం అనడానికి అనిపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడని మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు మంచి స్థానంలో నిలబడతాడని పేర్కొన్నారు. ఇక ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది.



మెగాస్టార్ చిరంజీవి గతంలో జగన్ ను కలిసిన ఫోటో షేర్ చేసిన ఆమె దారుణమైన కామెంట్లు చేసింది.  ఆమె చేసిన వ్యాఖ్యలు యధాతధంగా మీకోసం ఈ పక్కనున్నాడు దొంగ బాడకవ్ అని ఎప్పుడో చెప్పా విన్నారా జగనన్నా? వీడు ఇప్పుడు తొందరపడి ముందే కూసాడు, ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు ఈ వెధవ. పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట, ఇంకోసారి ఈ విషపురుగుగాడు మీ పక్కన నిలబడడం నేను చూడకూడదు అంతే ఇట్స్ మై ఆర్డర్ అని అనే అంత సీన్ లేదు నాకు లేదు కానీ ఆర్డర్ ఏ అంటూ ఆమె రాసుకొచ్చింది.


మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా సపోర్ట్ చేయడంతో శ్రీరెడ్డి ఈ విధంగా కామెంట్లు చేసింది. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే వివాదాస్పద వ్యాఖ్యలతో సిద్ధమైపోయే శ్రీరెడ్డి ఈ సారి ఆయన సోదరుడు చిరంజీవిని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చిన శ్రీ రెడ్డి ఆ తర్వాత దాన్ని రూపుమాపాలని చెబుతూ పెద్ద ఉద్యమమే చేసింది. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో చెన్నై వెళ్లి అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రస్తుతానికి బిజీ బిజీగా ఉంది. తెలుగులో కూడా వంటలు చేస్తూ చేస్తున్న వీడియోలకు మంచి వ్యూస్ లభిస్తున్నాయి.


Also Read: Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్‌ కోసం ఇలానా?


Also Read: Priyanka Jawalkar SIzzling Photos: తెలుగమ్మాయి ప్రియాంక పరువాల విందు.. వైట్ డ్రెస్ లో దేవకన్యలా వలపువల!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook