Heroines Remunerations: ఇండియాలో మొట్టమొదటిసారిగా 1 కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో అమితాబ్ బచ్చన్ కాదు.. షారుఖ్ ఖాన్ కాదు.. సల్మాన్ ఖాన్ కాదు.. రజినీకాంత్ కాదు.. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవినే అనే విషయం ఇటీవల మనం చెప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే మన ఇండియాలో హీరోయిన్స్‌లో మొట్టమొదటిసారిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరు అనే ఆసక్తికరమైన చర్చ కూడా ఉంది. మన దేశంలో బాలీవుడ్ టు మాలీవుడ్.. అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్స్ జాబితాలో రేఖ, మాధురి దీక్షిత్, కరీనా కపూర్ ఖాన్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, ఆలియా భట్.. ఇప్పుడిలా చెప్పుకుంటూ పోతే అది పెద్ద జాబితానే ఉంది. కానీ తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ మాత్రం వీళ్లలో ఎవ్వరూ కారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును.. మనం ముందుగా చెప్పుకున్న హీరోయిన్స్ అంతా ఒకానొక దశలో అత్యధిక పారితోషికం అందుకున్న వాళ్లే కానీ... తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ మాత్రం మన అతిలోక సుందరి శ్రీదేవినే. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీదేవినే తొలిసారిగా కోటి రూపాయలు డిమాండ్ చేసిన హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఆమె హీరోలకు సమాంతరంగా పారితోషికం డిమాండ్ చేసినప్పటికీ.. నిర్మాతలు మాత్రం ఆమెకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కాదనకుండా ఆ రెమ్యునరేషన్ అందించారు. 


1963 ఆగస్టు 13న తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో జన్మించిన శ్రీదేవి... తనకు 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే బాల నటిగా కెరీర్ ప్రారంభించింది. బాలనటిగా మెప్పించడమే కాకుండా యవ్వనంలో హీరోయిన్ గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె నటించిన అన్ని భాషల్లో దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించింది. అలా టాప్ హీరోయిన్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మకుటం లేని మహారాణిగా ఏలింది.


శ్రీదేవి 1976లో తమిళ చిత్రం మూండ్రు ముడిచులో తన మొదటి ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆ తర్వాత ఆమె కమల్ హాసన్ మరియు రజనీకాంత్‌లతో కలిసి అనేక చిత్రాలలో పనిచేసింది. శ్రీదేవి ఒకప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి మరియు నివేదికల ప్రకారం, శ్రీదేవి తన సినిమా కోసం కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి బాలీవుడ్ నటి.


1983లో హిమ్మత్‌వాలా చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అంతకంటే ఆమె బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసినప్పటికీ అవేవీ మరీ అంతగా చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపునివ్వ లేదు. హిమ్మత్ వాలా సక్సెస్ తరువాత శ్రీదేవి ఇక వెను తిరిగి చూసిన దాఖలాలు లేవు.


ఒకానొక ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఆమెతో కలిసి నటిస్తే తమని ఎవ్వరూ గుర్తించడం లేదని.. అభిమానులు, ఆడియెన్స్ ఫోకస్ అంతా శ్రీదేవిపైనే ఉంటోంది అని చెప్పుకొచ్చాడు. అందుకే ఆమెతో సినిమాలు చేయాలంటే భయం వేస్తోంది అని సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హీరోలను సైతం అభద్రతా భావానికి గురిచేసేంత గొప్ప ఇమేజ్ శ్రీదేవి సొంతం. దటీజ్ శ్రీదేవి స్టామినా.