Srikanth Iyengar: క్షమాపణలు చెప్పడానికి కూడా టైమ్ కావాలా.. శ్రీకాంత్ అయ్యంగార్ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..
Srikanth Iyengar: ఇటీవలె దరిద్రానికి విరోచనాలు వస్తే..రివ్యూ రైటర్లు పుడతారు అంటూ సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. రివ్యూ రైటర్లుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రివ్యూ రైటర్స్ అసోషియేషన్స్ ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాసారు. తాజాగా దానిపై శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించారు.
Srikanth Iyengar: సినిమా రివ్యూ రైటర్స్‌పై చేసిన వ్యాఖ్యలకు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించారు. త్వరలోనే క్షమాపణలు చెబుతానని ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇటీవల విడుదలై పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా రివ్యూలు రాసే వారిపై పరుష పదజాలం ఉపయోగించారు. అనకూడని మాటలతో వారిపై విరుచుకు పడ్డారు. దరిద్రానికి విరోచనాలు అయితే రివ్యూ రైటర్లు పుడతారని చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం రాని వాళ్లు రివ్యూ రైటర్లు అయిపోతున్నారంటూ ఒకింత అసభ్య పదజాలాన్ని వాడారు. అంతేకాదు సినిమా రివ్యూలు ఆపేయాలంటూ తీవ్ర దుర్భాషలాారు.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో శ్రీకాంత్ అయ్యంగార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దానిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్ వీడియో విడుదల చేశారు. పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను కొన్ని మాటలు మాట్లాడాను. కొన్ని విషయాల్లో బాధ కలిగించాను. త్వరలోనే మీడియాకు క్షమాపణలు చెబుతాను. దయచేసి వేచి ఉండండని ఎక్స్‌లో పేర్కొన్నారు శ్రీకాంత్ అయ్యంగార్. అది కూడా ఏదో సెటైరికల్ గా ఉన్నట్టు ఉంది. క్షమాపణలు చెప్పే ఉద్దేశ్యంతో శ్రీకాంత్ అయ్యంగార్ ఇంకేమి ప్లాన్ చేసాడో చూడాలి.
అయితే క్షమాపణలు చెప్పడానికి వేచి ఉండాలా.. ఇదే వీడియోతో పాటు తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణాలు చెబితే సరిపోయేది. ఇంతోటి దానికి మరోసారి క్షమాపణల కోసం వేచి ఉండటం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. అదేదో వీడియో క్షమాపణలు చెప్పేస్తే పని అయిపోయేది. మొత్తంగా శ్రీకాంత్ అయ్యంగార్ మీడియాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశ్యం ఉందా లేదా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. రివ్యూ రైటర్స్ వల్ల ఎన్నో చిన్ని సినిమాలు పెద్ద సక్సెస్ అయిన సందర్బాలున్నాయి. హానుమాన్, సుహాస్.. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, గామి, టిల్లు స్క్వేర్, అంతకు ముందు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి చిత్రాల సక్సెస్ లో రివ్యూ రైటర్స్ కూడా ఓ కారణం అని చెప్పాలి. మొత్తంగా రివ్యూస్ విషయంలో కొన్ని సందర్భాల్లో చెడు జరిగినా.. ఎక్కువ మటకు చిన్న చిత్రాలకు ఈ రివ్యూస్ వల్ల మంచి విజయాలు సాధించిన సందర్బాలున్నాయి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter