Rajamouli Devika: సినిమాకి 100 కోట్లు తీసుకోవడం కాదు.. ఓ కోటి హెల్ప్ చేయి! రాజమౌళిని ఆటాడుకుంటున్న నెటిజన్లు!
బాహుబలి సినిమా కోసం పని చేసిన దేవిక ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె వైద్య చికిత్స కోసం దయచేసి అందరూ సాయం చేయండని దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఓ ట్వీట్ చేశారు.
SS Rajamouli brutally trolled by Netizens: పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) ట్విట్టర్ వేదికగా ఆర్ధిక సహాయం కోరారు. టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'బాహుబలి' (Baahubali) సినిమా కోసం పని చేసిన దేవిక (Devika) అనే మహిళ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమె వైద్య చికిత్స కోసం దయచేసి అందరూ సాయం చేయండని దర్శక ధీరుడు ఓ ట్వీట్ చేశారు.
దేవిక స్టోరీని షేర్ చేసిన రాజమౌళి ఈరోజు ఉదయం ఓ ట్వీట్ చేశారు. 'బాహుబలి సినిమా సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. పలు పోస్ట్ ప్రొడెక్షన్స్ పనులకు ఆమె కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆమెకున్న అభిరుచి, అంకితభావం మాటల్లో చెప్పలేము. దురదృష్టవశాత్తు దేవిక బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దయచేసి ఆమెకు ఆర్థిక సాయం చేయండి' అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అయింది. రాజమౌళిని సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.
ఎస్‌ఎస్ రాజమౌళి ట్వీటుకు కొందరు నెటిజన్లు మద్దుతు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. 'రాజమౌళి.. సోను సూద్‌ను చూసి నేర్చుకో ఎలా సహాయం చేయాలో' అని ఒకరు కెమెంట్ చేయగా.. 'సినిమాకి 100 కోట్లు తీసుకోవడం కాదు.. ఓ కోటి హెల్ప్ చేయి' అని ఇంకొకరు కామెంట్ చేసారు. '30-40కోట్లు తీసుకునే మీకు 3కోట్లు ఓ లెక్కనా?', 'ఆపరేషన్‌కు కావాల్సిన 3కోట్లు ఇవ్వొచ్చుగా', 'మీరెందుకు సహాయం చేయలేదు' అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 'రాజమౌళి సాయం చేసే మిమ్మలి ఆడుతున్నాడు' అంటూ మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి