IPL 2022 Auction David Warner: డేవిడ్ వార్నర్‌ను ఏ ప్రాంచైజీ తీసుకోదు.. కానీ! ఆకాశ్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు!!

ఐపీఎల్ 2022 మెగా వేలంలో సారథిగా ఏ ప్రాంచైజీ కూడా డేవిడ్ వార్నర్‌ను తీసుకోదని, అయితే అతడికి వేలంలో భారీ పోటీ మాత్రం ఉంటుందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 02:50 PM IST
  • డేవిడ్ వార్నర్‌ను ఏ ప్రాంచైజీ తీసుకోదు
  • ఆకాశ్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు
  • వేలంలో వార్నర్‌ కోసం పోటీ ఉంటుంది
IPL 2022 Auction David Warner: డేవిడ్ వార్నర్‌ను ఏ ప్రాంచైజీ తీసుకోదు.. కానీ! ఆకాశ్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు!!

Aakash Chopra about David Warner: ఐపీఎల్ 2022 (IPL 2022) మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) సిద్ద‌మ‌వుతోంది. మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పాత ఫ్రాంఛైజీలు రిటెన్షన్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించగా.. కొత్త ఫ్రాంఛైజీలు అయిన లక్నో, అహ్మదాబాద్‌ కూడా తాము ఎంపిక చేసుకున్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. లక్నో జట్టుకు టీమిండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ సారథి కాగా.. అహ్మదాబాద్‌ టీంకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

స్టార్ ఆట‌గాళ్లు అందుబాటులో ఉండ‌డంతో ఐపీఎల్ 2022 వేలం (IPL 2022 Auction)కు ప్రాధాన్యత సంత‌రించుకుంది. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (David Warner)ను ఏదైనా ప్రాంచైజీ కెప్టెన్‌గా ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. సారథిగా ఏ ప్రాంచైజీ కూడా అతడిని తీసుకోదన్నాడు. అయితే వేలంలో ఆటగాడిగా వార్నర్‌ కోసం పోటీ ఉంటుందని చెప్పాడు. 

Also Read: King Cobra: హ్యాట్సాఫ్ భయ్యో.. కరవడానికి మీదికొస్తున్న భారీ కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో పట్టేశాడు (వీడియో)!!

'ఐపీఎల్ 2022 వేలంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకోడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాకపోవచ్చు. ఇప్పటికే మూడు జట్లు కొత్త సారథిని నియమించుకోవాలని చూస్తున్నా.. వార్నర్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకోవు. దేవ్ ఈసారి కొత్త జట్టుకు వెళ్లడం ఖాయమే. అంతేకాదు భారీ ధర కూడా పలుకుతాడు. కానీ కెప్టెన్సీ పరంగా అతడికి అవకాశం లేదు. ఐపీఎల్‌ ఒక చిన్న కుటుంబం కాబట్టి.. గతేడాది ఏం జరిగిందో అందరికీ ఓ అవగాహన ఉంటుంది. ఆటగాళ్లు, ఫ్రాంఛైజీల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయం అందరికి తెలుస్తుంటుంది' అని ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) వివరించాడు. 

డేవిడ్ వార్నర్‌ ఐపీఎల్‌ 2021లో పేలవ ప్రదర్శన చేయడంతో సన్‌రైజర్స్‌ హైదేరాబద్ యాజమాన్యం ముందుగా కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఆపై తుది జట్టులో స్థానం లేకుండా చేసింది. ఆపై ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్‌ ఆటగాళ్ల జాబితాలోనూ వార్నర్‌కు అవకాశం ఇవ్వలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే ఐపీఎల్ జరిగిన టీ20 ప్రపంచకప్‌, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో పరుగుల వరద పారించి తానేంటో నిరూపించుకున్నాడు. అందుకే ఐపీఎల్ 2022 వేలంలో అతడి ఎంపికపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

Also Read: Rohit - Sammy: ధోనీ లాగే అతడు మంచి కెప్టెన్.. టీమిండియా సురక్షితమైన సారథి చేతుల్లోనే ఉంది: సామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News