Pooja Prasad in Movies: సినీ ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి కోడలు.. ఆ ఫొటోతో మేటర్ లీక్!
Pooja Prasad to work for Mahesh Babu Film: దర్శక ధీరుడు రాజమౌళి కోడలు పూజా ప్రసాద్ కూడా ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం మొదలయింది. ఆ వివరాల్లోకి వెళితే
SS Rajamouli’s Daughter in Law Pooja Prasad to work for Mahesh Babu Film: దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అదేంటి ఎప్పుడో విడుదలైన సినిమాని ఇప్పుడు ప్రమోట్ చేయడం అనుకుంటున్నారా. అయితే ఈ విషయం చదవాల్సిందే శుక్రవారం నాడు ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్లో పెద్ద ఎత్తున విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్ ఈ. నేపథ్యంలోనే సినిమాను ప్రమోట్ చేసే ఉద్దేశంతో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి, ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి, రాజమౌళి తన భార్య రమతో కలిసి జపాన్ చేరుకుని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
జపాన్ మీడియా కూడా వీరికి మంచి కవరేజ్ ఇచ్చింది, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యవహారం తెరమీదకు వచ్చింది. సాధారణంగా రాజమౌళి కుటుంబ సభ్యులందరూ రాజమౌళి సినిమాలో భాగమవుతూ ఉంటారు. ఆయన భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ ఉంటే రాజమౌళి కీరవాణి సంగీతం అందిస్తారు, కీరవాణి భార్య సినిమాకు ప్రొడక్షన్ కంట్రోలర్ గా బాధ్యతలు అందుకుని వ్యవహరిస్తూ ఉంటారు.
ఇక రాజమౌళి కుమారుడు కార్తికేయ సైతం సినిమాలో డైరెక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. రాజమౌళి తర్వాత కార్తికేయ సెట్ మొత్తాన్ని చక్కగా పెడుతూ ఉంటారు. ఇప్పుడు కార్తికేయ భార్య కూడా ఆర్ఆర్ఆర్ జపాన్ ట్రిప్ లో కనిపించడంతో ఈ విషయం మీద కొత్త చర్చ మొదలైంది. జగపతిబాబు సోదరుడి కుమార్తె అయిన పూజా ప్రసాద్ ను కార్తికేయ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కార్తికేయతో కలిసి పూజ ఆర్ఆర్ఆర్ జపాన్ ట్రిప్ లో కనిపించడంతో రాజమౌళి ఫ్యామిలీ సినిమా టీంలో ఆమె కూడా చేరిందనే ప్రచారం ఊపందుకుంది.
నిజానికి కార్తికేయ వివాహం చేసుకునే నాటికే ఆమె ఒక కర్నాటిక్ సింగర్, ఈ నేపథ్యంలో ఆమె కీరవాణి టీంలో చేరి తనకు అచ్చొచ్చిన సింగర్ బాధ్యతలు నిర్వర్తిస్తుందా లేక రాజమౌళి ఆమెకు కొత్త బాధ్యతలు ఏమైనా అప్పచెబుతారా అనే విషయం కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే మరికొందరు మాత్రం సరదాగా హీరోలు తమ భార్యలతో వెళుతున్నారు కదా అని కార్తికేయ కూడా తన భార్యను ట్రిప్ కి తీసుకెళ్లి ఉంటారు అంతమాత్రానికే ఆమెను కూడా రాజమౌళి సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు అంటూ ప్రచారం చేయడం తగదని కామెంట్ చేస్తున్నారు.
మరి రాజమౌళి తన కోడలిని సినీ రంగ ప్రవేశం చేయిస్తారా? ఆమెకు అందులో ఆసక్తి ఉందా? లేక ఇదంతా కేవలం ట్రిప్ కోసం జరిగిన దాంతోనే మొదలైన ప్రచారమా అనేది తెలియాలంటే రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లే వరకు ఆగక తప్పదు. ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు, మహేష్ 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతే మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కథకు సంబంధించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అధికారిక క్లారిటీ అయితే ఇప్పటి వరకు లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook