Sardar Vs Ori Devuda Vs Prince Vs Ginna 1st Day Collections: ఈ దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రెండు సినిమాలు తెలుగు హీరోలు నటించిన సినిమాలు కాగా రెండు తమిళ హీరోలు నటించిన సినిమాలు. అందులో మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా ఒకటి కాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలు తెలుగు సినిమాలు. అలాగే మన తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్లో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ సినిమా మూడోది అలాగే కార్తీ హీరోగా తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో సర్దార్ అనే మూవీ కూడా వచ్చింది.
ఈ నాలుగు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల పరిస్థితి కొంతవరకు పర్వాలేదు. నిజానికి మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ లభించింది కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 12 లక్షల మాత్రమే (Ginna 1st Day Collections) షేర్ లభించింది. ఇక మిగతా సినిమాలన్నింటిలో పోలిస్తే కార్తి నటించిన సర్దార్ సినిమాకి మంచి టాక్ లభించడంతో ఈ సినిమాకి (Sardar 1st Day Collections) కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.
ఈ సినిమా నైజాం ప్రాంతంలో 40 లక్షల దాకా షేర్ వసూలు చేస్తే సీడెడ్ లో 10 లక్షల షేర్ వసూలు చేసింది. మొత్తం ఆంధ్ర 45 లక్షల పైగా షేర్ వసూలు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 95 లక్షల దాకా షేర్ వసూలు చేసింది. ఇక విశ్వక్సేన్ హీరోగా వెంకటేష్ దేవుడి పాత్రలో నటించిన ఓరి దేవుడా సినిమా కూడా మంచి వసూళ్లు అయితే వచ్చాయి. ఈ (Ori Devuda 1st Day Collections) సినిమా నైజాం ప్రాంతంలో 35 లక్షలు వసూలు చేస్తే సీడెడ్ ప్రాంతంలో 10 లక్షలు వసూలు చేసింది, మిగతా ఆంధ్ర ప్రాంతం అంతా కలిపి 45 లక్షలు వసూలు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 90 లక్షలు వసూలు చేసింది.
ఇక శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో రూపొందిన ప్రిన్స్ సినిమా (Prince 1st Day Collections) నైజాం ప్రాంతంలో 35 లక్షలు మిగతా ప్రాంతంలో 20 లక్షలు వెరసి ఆంధ్రప్రదేశ్లో 55 లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 90 లక్షల దాకా ఈ సినిమా షేర్ వసూలు చేసింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మూడు సినిమాలకు దాదాపు ఒకే మార్జిన్లో వసూళ్లు రావడం. కార్తి హీరోగా నటించిన సర్దార్ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది సుమారు 6 కోట్ల 90 లక్షల దాకా మొదటిరోజు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఏడు కోట్ల మూడు లక్షలు వసూలు చేసింది. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు వసూళ్లు కలిపితే అందరికంటే ఎక్కువగా ప్రిన్స్ సినిమా వసూలు చేసింది.
(గమనిక : ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.)
Also Read: Anu Emmanuel : ఈవెంట్ ముగిసే టైంకి వచ్చిన అను ఇమాన్యుయేల్.. చురకలు వేసిన అల్లు అరవింద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook