Bubblegum Teaser: ప్రముఖ యాంకర్ సుమ కనకాల-సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ 'బబుల్‍గమ్'(Bubblegum Movie). రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి రవికాంత్ పారెపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రోషన్ కు జోడిగా మానస చౌదరీ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా బబుల్‍గమ్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''ప్రేమ అనేది బబుల్‍గమ్ లాంటిదని.. ముందు తియ్యగా ఉన్నా.. ఆ తర్వాత అంటుకుంటుందంటూ'' వాయిస్ ఓవర్‌తో బబుల్‍గమ్ టీజర్ మెుదలవుతుంది. పబ్‍లో డీజేగా పనిచేసే రోషన్... అక్కడకు వచ్చిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వారి ప్రేమ ఎటువంటి మలుపులు తిరిగిందనేది కథ.  సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్‍లాక్‍తో బబుల్‍గమ్ మూవీ టీజర్ ముగుస్తుంది.  బబుల్‍గమ్ మూవీని డిసెంబర్ 29వ తేదీన ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు. 


బబుల్‍గమ్ సినిమాలో వైవా హర్ష, కిరణ్, అనన్య ఆకుల, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, అను హసన్, జైరామ్ ఈశ్వర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పి.విమల నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్‌గా సురేష్ రగుతు పనిచేస్తున్నారు. డైరెక్టర్ రవికాంత్ గతంలో క్షణం, కృష్ణ అండ్ లీల చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 



Also Read: Bigg Boss 7 Telugu: హౌస్ లోకి గౌతమ్ రీ ఎంట్రీ.. వచ్చి రాగానే హౌస్ మేట్స్ పై ఫైర్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి