Ramam Raghavam: సుకుమార్ చేతుల మీదుగా రామం రాఘవం సినిమా పాట.. ఆకట్టుకుంటున్న లిరిక్స్..!
Ramam Raghavam Latest Song: కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి.. బిగ్ బాస్ లో కూడా అందరినీ ఆకట్టుకున్న ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా తన సత్తా చాటుబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు సముద్రఖని హీరోగా వస్తున్న రామం రాఘవం సినిమా నుంచి తెలిసిందా నేడు అనే పాట ఇవాళ విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ పాటని లాంచ్ చేశారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Telisinda Nedu song from Ramam Raghavam: విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న తమిళ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా రామం రాఘవం. ధనరాజ్ కోరనాని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న ధనరాజ్ ఈ సినిమాతో ఇప్పుడు డైరెక్టర్ గా కూడా మారబోతున్నారు.
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో.. పృద్వి పోలవరపు ఈ సినిమాని నిర్మించారు. ద్విభాషా సినిమాగా ఈ చిత్రం త్వరలో విడుదల కోసం అవుతోంది.
తాజాగా ఇవాళ టీచర్స్ డే సందర్భంగా.. ఈ సినిమా నుండి తెలిసిందా నేడు అనే పాటను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగే ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట ఇంటర్నెట్ లో వైరల్ అయింది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ను క్యాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ పాట వీడియో అందరినీ మెప్పించింది.
అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. మోక్ష, హరీష్ ఉత్తమన్,సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా.. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వ్యవహరించారు.
రామం రాఘవం సినిమాలోని పాటలు అన్నిటికీ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది.
Read more: GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.