దేవుడి మహిమా ? లేక మానవ మేధస్సా ? అసలు సుబ్రహ్మణ్యపురంలో ఏముంది ?
సుబ్రహ్మణ్యపురంలో ఏం జరుగుతోంది ?
సుమంత్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా సుబ్రహ్మణ్యపురం. బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. సుమంత్ సరసన ఈషా రెబ్బ కథానాయికగా నటిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో అంతుచిక్కని పరిణామాలు, దేవుడిపై రీసెర్చ్ చేసే పాత్రలో సుమంత్ నటించాడు. ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలతో తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. సుబ్రహ్మణ్యపురం ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.