Sudheer Babu: న‌వ ద‌ళ‌ప‌తి 'సుధీర్ బాబు' హీరోగా పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ మూవీ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన విడుదల చేసారు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటు్న ఈయన ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ లో నటించడానికి ఓకే చెప్పారు. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లార్జ‌ర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని సరికొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌బోతున్నఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ కు ఎంతో ఇంపార్టెంటెన్స్ ఉందట. ఈ సినిమా వెంకట్ క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జూన్ 14న విడుద‌లైన‌ హ‌రోంహ‌ర చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్‌గా స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. అందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు, కథా, క‌థ‌నంకు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.


రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో ఇప్పుడు సుధీర్ బాబు చేయ‌బోతున్న పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.


ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బాలీవుడ్ కథానాయిక నటించబోతుంది.  త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ఆ వివ‌రాల‌ను తెలియజేయనున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చిలో విడుద‌ల చేయబోతన్నట్టు ప్రకటించారు.  లోతైన క‌థ‌తో రానున్న ఈ చిత్రంలో కుట్ర, కుతంత్రాలు క‌ల‌గ‌లిసిన చెడుకి, మంచి జ‌రిగే యుద్ధంగా  భారతీయ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెర‌కెక్క‌నుంది.


ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ న‌చ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఎగ్జైటింగ్ ‌గా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సుకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉందన్నారు. మొత్తంగా ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మన పురాణాలను నేపథ్యంగా తీసుకొని తెరకెక్కించారు.  ఈ సినిమా  ఫస్ట్ లుక్ ను ఆగష్టు 15న విడుదల కానుంది.


Also Read: Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.