Pushpa 3: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. పుష్ప పార్ట్ 3 టైటిల్ ఇదే?
Allu Arjun Pushpa: అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్థాయికి చేర్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మూడో భాగం కూడా ఉంటుందనే వార్త గట్టిగా వినిపిస్తోంది..
Pushpa 3 Title: పుష్ప సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తంగా తారాస్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాతో ఇప్పటివరకు తెలుగు హీరో సంపాదించని నేషనల్ అవార్డు సైతం తెచ్చుకున్నాడు మన బన్నీ. తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషలలో పుష్ప చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లోనే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం సీక్వెల్ పుష్ప : ది రైజ్ పైన ప్రేక్షకులకు ప్రస్తుతం అంచనాలు భారీగా ఉన్నాయి.
కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకోగా ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి అందుతున్న మరో వార్త అల్లు అర్జున్ అభిమానులను తెగ ఖుషి చేస్తోంది.
నిన్న మొన్నటి వరకు పుష్ప: ది రూల్ సినిమాకి రెండో భాగం అనగా పుష్ప: ది రైజ్ ఎండ్ కార్డ్ వేస్తుంది అనుకున్నారు అందరూ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా రాబోతుందట. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ తరువాత వచ్చే భాగానికి పుష్ప రోర్ అని టైటిల్ ని కూడా అనుకుంటున్నారట. ఇలా మూడు పార్టులుగా సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు అని వార్త ప్రస్తుతం సినిమా సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది.
ఈ మూడో భాగం కథ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అని చూపించి ఆ తరువాత మూడో భాగంలో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలి అంతే మాత్రం ఈ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.
కాగా అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక సునీల్, అనుసయా, ధనంజయ నెగటివ్ పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also read: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..
Also read: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook