Karthik Varma Dandu Health: ‘విరూపాక్ష’ డైరెక్టర్ కి అరుదైన వ్యాధి.. బతకడు అనుకున్నా.. బయటపెట్టిన సుకుమార్!
Sukumar Comments on Virupaksha Director Health: సుకుమార్ శిష్యుడు సాయి కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఆరోగ్యం గురించి సుకుమార్ కీలక విషయాలు బయటకు వచ్చాయి.
Sukumar Comments on Virupaksha Director Karthik Varma Dandu health: రిపబ్లిక్ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొత్త దర్శకుడు, సుకుమార్ శిష్యుడు సాయి కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈనెల 21వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో నిర్వహించింది సినిమా యూనిట్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ సహా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన సుకుమార్ సైతం అద్భుతంగా మాట్లాడి ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. సుకుమార్ మాట్లాడుతూ కార్తీక్ ఈ సినిమాకి ముందు నాకు కథ చెప్పాడని, ఆ కథ నాకు నచ్చలేదు కానీ కార్తీక్ కథ చెప్పే విధానం నాకు నచ్చింది అని చెప్పుకొచ్చారు. వేరే కథతో సినిమా చేద్దామని చెప్పానని ఆయన ఆ సమయంలో విరూపాక్ష కథతో నా దగ్గరికి వచ్చాడని అన్నారు.
ఇదీ చదవండి: Naa Peru Mukesh: నా పేరు ముఖేష్ రియల్ స్టోరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటే?
ఈ సినిమా తొలి సిట్టింగ్ లోనే నాకు ఎంతగానో నచ్చిందని తర్వాత హీరో, నిర్మాతకి ఆయనే స్వయంగా కథ వినిపించుకుని ఓకే చేయించుకున్నాడని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా కథ చెప్పిన సమయంలో కార్తీక్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆయన ఆయుష్షు కూడా చాలా తక్కువగా ఉందని ప్రతిరోజు స్టెరాయిడ్స్ ఎక్కించుకునేవాడని అలా ఎక్కించుకోక పోతే బతకడేమో అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని చెప్పకుచ్చారు. అతని అమ్మ గారి ప్రార్ధనల వల్లే బతికాడు అంటూ ఆయన కామెంట్ చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నాడని ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాని పూర్తి చేశాడని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఇక తాను ఈ మధ్యనే సినిమా చూశానని సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని సుకుమార్ కామెంట్ చేశాడు. ఇక ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సుకుమార్ తన శిష్యుడు మీద నమ్మకం వ్యక్తం చేశాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా ఈ మధ్యనే పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు అందరూ సినిమా చూసి సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. హారర్ థ్రిల్లర్ కాబట్టి ఏ సర్టిఫికెట్ జారీ చేశారని అయితే ఈ సినిమా మాత్రం అన్ని వయసుల వారు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని సినిమా ఘంటాపథంగా చెబుతోంది. ఇప్పటికే డివోషనల్ గా ఈ సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద డివోషనల్ కంటెంట్ మీద ఆసక్తి చూపించేవారు కూడా ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక చూడాలి ఈ సినిమా ఏ మేరకు హిట్ అవ్వదు అనేది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook