Rajamouli Marriage: మా అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందే మా ఇంటికి వచ్చేవాడు..రాజమౌళి సీక్రెట్స్ బయటపెట్టిన కొడుకు!

Facts behind Rama- Rajamouli Marriage: దర్శకధీరుడు రాజమౌళి తన భార్య రమను రెండో వివాహం చేసుకున్న అంశం గురించి ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 17, 2023, 06:39 PM IST
Rajamouli Marriage: మా అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందే మా ఇంటికి వచ్చేవాడు..రాజమౌళి సీక్రెట్స్ బయటపెట్టిన కొడుకు!

Karthikeya Comments on Rama- Rajamouli Marriage: దర్శకధీరుడు రాజమౌళి తన భార్య రమను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రమకు అంతకుముందే ఒక వ్యక్తితో వివాహమై ఒక బాబు జన్మించిన తర్వాత ఆమె మొదటి భర్తకు దూరమైంది. అయితే స్వయానా వదినకు చెల్లెలు కావడంతో రమతో ఏర్పడిన పరిచయం రమా రాజమౌళి ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఒక బాబు ఉన్నాడని తెలిసినా కూడా రాజమౌళి ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చారు.

ఇక వారి కుమారుడు కార్తికేయ కూడా ఇప్పుడు తండ్రి మాటలోనే పయనిస్తూ ప్రొడక్షన్ ఫీల్డ్ లో దూసుకుపోతున్నాడు. దాదాపుగా రాజమౌళి పనిచేస్తున్న అన్ని సినిమాలకు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంతెందుకు ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించింది అంటే దానికి ముఖ్య కారణం కార్తికేయ అని కూడా పలువురు ప్రస్తావించారంటే దాని వెనుక ఆయన కృషి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి రాజమౌళి, కార్తికేయ సొంత తండ్రి కొడుకులు కాదు. కానీ సొంత తండ్రి కొడుకులు కూడా వీరంత అన్యోన్యంగా ఉండరేమో అని అనుమానం కలిగేలా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు.

ఇదీ చదవండి: Nagarjuna Divorce Reason: నాగచైతన్య తల్లికి నాగార్జున విడాకులు ఇవ్వడానికి అసలు రీజన్ ఇదా?

అయితే తాజాగా కార్తికేయ తన తండ్రి రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కార్తికేయ ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు కోసం చాలా కష్ట పడ్డామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం కోసం 80 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి బయట ప్రచారం జరిగిన నేపథ్యంలో వాటిని ఆయన ఖండించారు. ఆస్కార్ కి ఏ కేటగిరీకి పంపించాలి? అని ముందు నుంచి ఆలోచిస్తూ ఎక్కడో బెస్ట్ ఫిలిం కేటగిరీకి పెడితే వస్తుందేమో అనే కొంత ఆశ ఉందని అందుకే దాన్ని నామినేట్ చేసామని అయితే అది రాలేదని బాధ మాత్రం ఉండిపోయింది అని చెప్పుకొచ్చారు.

ఇక పర్సనల్ విషయాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ తన తల్లి ఒక సింగిల్ మదర్ అని ఆవిడ అలా నన్ను పెంచుతున్న సమయంలో రాజమౌళి వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నారని అన్నారు. అలాంటి సమయంలో మీ ఆలోచన ధోరణి ఎలా ఉందని అడిగితే నిజానికి అమ్మ రాజమౌళి ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఏడాది ముందు నుంచే ఆయన మా ఇంటికి వస్తూ ఉండేవారు, నన్ను అమ్మను అప్పుడప్పుడు బయటకు తీసుకెళుతూ ఉండేవారు, డిన్నర్లకి తీసుకెళ్తూ ఉండేవారు. అలా మా మధ్య ఒక వైబ్ క్రియేట్ అయింది. ఆయన ఫాదర్ అని ఒక ఫీల్ వచ్చేసింది, ఆయనను ఎప్పటికీ వదలాలి అనిపించలేదు ఆయన నన్ను అంతలా చూసుకునేవారు అంటూ కామెంట్ చేశాడు. 

ఇదీ చదవండి: Venkatesh Wife: వెంకటేష్ భార్య నీరజా‘రెడ్డి’.. కులం, బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News