Naa Peru Mukesh: నా పేరు ముఖేష్ రియల్ స్టోరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటే?

Naa Peru Mukesh Real Story: నా పేరు ముఖేష్ నేను ఒకే ఒక సంవత్సరం గుట్కా నమిలాను, కానీ ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది అంటూ దీనంగా ముక్కుకి పైపు పెట్టుకున్న వ్యక్తి రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 17, 2023, 06:27 PM IST
Naa Peru Mukesh: నా పేరు ముఖేష్ రియల్ స్టోరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటే?

Mukesh Harane Real Story Explained in Telugu: మనం సినిమా ధియేటర్ కి వెళ్ళగానే ముందుగా పొగాకు వ్యతిరేకంగా ప్రభుత్వం సిద్ధం చేసిన కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ప్రసారం చేస్తారు. ప్రతి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ పడటం కంటే ముందే ఈ అడ్వర్టైజ్మెంట్లు ప్లే చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పుడు కష్టంగా కొన్నాళ్ల క్రితం మనం పరిశీలిస్తే, నా పేరు ముఖేష్ నేను ఒకే ఒక సంవత్సరం గుట్కా నమిలాను, కానీ ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది అంటూ దీనంగా ముక్కుకి పైపు పెట్టుకున్న ఒక వ్యక్తి కనిపిస్తూ ఉండేవాడు.

అయితే 2015 తర్వాత ముఖేష్ ను తొలగించి ఆయన స్థానంలో సునీత అనే మరో మహిళను పెట్టారు. కానీ ముఖేష్ గురించి దాదాపుగా అందరూ కామెంట్లు చేసుకునే ఉంటారు. నా పేరు ముఖేష్ అనే పదాన్ని మిమిక్రీ చేసి ఇమిటేట్ చేసి నవ్వుకునే ఉంటారు. కానీ అసలు ఆయన కథ ఏమిటి ముఖేష్ ఏ ప్రాంతానికి చెందిన వాడు ఒకే ఏడాది గుట్కా నమిలితే ఆయనకు గొంతు క్యాన్సర్ ఎందుకు వచ్చింది? అంటే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.  ఈ ముఖేష్ ది మహారాష్ట్రలోని భుసావల్ అనే ఒక చిన్న పట్టణం.

ఇదీ చదవండి: Venkatesh Wife: వెంకటేష్ భార్య నీరజా‘రెడ్డి’.. కులం, బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ముఖేష్ కుటుంబం అంతా రోజు వారి కూలి మీద జీవనం సాగిస్తూ ఉండేది. ముఖేష్ కూడా రోజువారీ కూలీగా తన ప్రస్థానం మొదలుపెట్టి, టైం పాస్ అవ్వడం కోసం స్నేహితుల ద్వారా గుట్కా అలవాటు చేసుకున్నాడు. దీంతో అతనికి నోటి క్యాన్సర్ వచ్చిందట. అయితే కేవలం భారత దేశంలోనే చాలా మంది ఈ పొగాకు వల్ల నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలుసుకున్న భారత ప్రభుత్వం ఒక యాడ్ చేసి అందరినీ భయపెట్టేలా ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది.

ఈ యాడ్ ఫిలిం కోసం షూట్ చేసేటప్పుడు అతని పలకరిస్తే గుట్కా తినడం మొదలుపెట్టినప్పుడు తన తల్లి తనను కొట్టిందని కానీ తాను ఆమె సలహా పట్టించుకోకుండా ఏడాది పాటు గుట్కా నమిలితే తనకు నోటి కాన్సర్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. చిన్న వయసు, అమాయకమైన ముఖంతో ముఖేష్ నోటి ద్వారా గుట్కా నమాలొద్దనే విషయాన్ని చెబితే నమిలే వారు కాస్త మనసుకి తీసుకుంటారని ఉద్దేశంతో ఈ ముఖేష్ యాడ్ షూట్ చేశారంట.

అలా షూట్ చేసిన తర్వాత 2009లో ముఖేష్ మరణించాడు. 2012లో నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టుబాకో ఎరాడికేషన్ అన్ని సినిమా ధియేటర్లలో ఈ ముఖేష్ యాంటీ టొబాకో యాడ్ ప్రదర్శించడాన్ని మాండేటరీ చేసింది. ఇక ఈ ముఖేష్ యాడ్ దాదాపుగా 2015 వరకు నడిచింది. అయితే ముఖేష్ యాడ్ తొలగించిన తర్వాత సునీత అనే మరో క్యాన్సర్ బాధితురాలిని ప్రస్తుతం చూపిస్తున్నారు. 

ఇదీ చదవండి: Nagarjuna Divorce Reason: నాగచైతన్య తల్లికి నాగార్జున విడాకులు ఇవ్వడానికి అసలు రీజన్ ఇదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News