Sundarm Master trailer: మాస్ మహారాజ్ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ రూట్లోనే ఆర్ టీ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకంపై సుధీర్ కుమార్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ సినిమాలో హర్ష చెముడు (వైవా హర్ష), దివ్య శ్రీపాద లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. కళ్యాణ్ సంతోష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ..
 
‘సుందరం మాస్టర్’ ట్రైలర్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడంటూ కొనియాడారు. కమెడియన్ నుంచి ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. హర్షను నమ్మి నిర్మాత సుధీర్, దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ చూస్తే  అర్థం అవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ప్రేక్షకుల ఆదరణ ఎపుడు ఉంటుందున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హర్ష చెముడు (వైవా హర్ష) మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్ చెప్పారు.  సుందరం మాస్టర్ సినిమా సరికొత్త పాయింట్‌తో రాబోతోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు కావొస్తోంది. ప్రతీ సారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు నచ్చింది.. కాబట్టి చేశాను. నేను చేయగలిగిన పాత్రలే ఉంటే తప్పకుండా చేస్తానన్నారు. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. అందరినీ భావోద్వేగానికి లోను చేస్తూ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. కామెడీనే కాకుండా ఈ సినిమాలో మంచి  డ్రామా కూడా ఉందదన్నారు.   ఈ సినిమా కోసం టీం  చాలా కష్టపడింది. నేచురల్ లొకేషన్స్‌కు వెళ్లి ఈ సినిమా షూటింగ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారుఉ. ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్నారు.




ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. ఒక మారుమూల గూడెంలో ఇంగ్లీష్ టీచర్ వస్తాడు సుందరం రావు అలియాస్ సుందరం మాస్టర్. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి ? ఆ గూడెం కట్టుబాట్లు ఏమిటి ? ఆ గూడెంలో ఒక అంతు చిక్కని రహస్యం ఏదో ఉంటుంది. దాన్ని సుందరం మాస్టర్ ఎలా చేధించడానేదే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. ఆద్యంతం నవ్వుకునేలా ఈ సినిమా ట్రైలర్ వుంది.


 


Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook