బిగ్ బాస్ షో ద్వారా సన్నీలియోన్ బాలీవూడ్ లో రంగప్రవేశం చేసి.. బాలీవూడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో, ఐటంసాంగ్ లతో బిజీగా ఉంది. బాలీవూడ్ లో కెరీర్ ప్రారంభించక ముందు శృంగార నటిగా కనిపించిన సన్నీలియోన్.. తాజాగా ఒక మంచి పనికోసం న్యూడ్ గా  దర్శనమిచ్చింది. పెటా తరుపున ప్రచారం కోసం భర్త డానియెల్ వెబర్ తో కలిసి ఒంటిమీద నూలుపోగు లేకుండా కనిపించింది. "మొసళ్ల చర్మాన్ని ఎలా వలుస్తారు? గొర్రెల నుంచి ఊలు ఎలా వలుకుతారు?" అంటూ తెలియజేస్తూ పెటా ఓ వీడియోను తయారుచేసింది. జంతు చర్మాలతో తయారుచేసిన వస్తువులను ధరించాలనుకోవడం మంచి కాదని తెలియజేయడం కోసం ఈ ప్రచారం చేశారు భార్యాభర్తలిద్దరూ..! 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING