Super Star Krishna Passed Away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్య పరిస్థితుల్లో గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆయన నాలుగు గంటల సమయంలో కన్నుమూసినట్లు కాంటినెంటల్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. గత గొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న ఆయనని సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కార్డియాక్ కరెక్ట్ కావడంతో హాస్పిటల్ కి తీసుకువచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వెంటనే ఎమర్జెన్సీ యూనిట్ కి తరలించిన వైద్యులు సిపిఆర్ అందించి ఆయనకు మళ్ళీ శ్వాస అందేలా చేశారు. కానీ వెంటనే సపోర్ట్ మీదే ఉంచాల్సి వచ్చింది. ఇదే విషయం మీద సోమవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించిన వైద్యులు కృష్ణ ఆరోగ్యం ఏ మాత్రం బాలేదని చాలా క్రిటికల్ గా ఉందని 48 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి మీడియా ముందుకు వస్తామని చెప్పిన వైద్యులు సోమవారం రాత్రి మరోసారి బులెటిన్ విడుదల చేశారు.


కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కనిపించిందని, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు సహా అన్ని భాగాలు పనిచేయడం మానేశాయని ప్రస్తుతానికి అయితే మందులకు ఆయన శరీరం సహకరిస్తుంది కానీ ఆయన స్పృహలోకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదని ప్రకటించారు. ఇక అనూహ్యంగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కన్నుమూసినట్లు ప్రకటన వచ్చింది.


సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో ఈ ఏడాదిలో ఇది మూడో మరణం జనవరి 2022లో ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందగా సెప్టెంబర్ 28వ తేదీన కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు కృష్ణ కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని అభిమానులు అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


Also Read: Super Star Krishna Health update : హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు


Also Read: Krishna Latest Health Bulletin: మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. మా చేతుల్లో ఏమీ లేదు.. డాక్టర్స్ కీలక ప్రకటన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook