Krishna Latest Health Bulletin: మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. మా చేతుల్లో ఏమీ లేదు.. డాక్టర్స్ కీలక ప్రకటన!

Super Star Krishna Latest Health Bulletin: కార్డియాక్ ఆరెస్ట్ తో కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 14, 2022, 08:59 PM IST
Krishna Latest Health Bulletin: మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. మా చేతుల్లో ఏమీ లేదు.. డాక్టర్స్ కీలక ప్రకటన!

Super Star Krishna Latest Health Update: సూపర్ సార్ కృష్ణ అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయనను తెల్లవారుజామున శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్చినట్లు ముందు ప్రచారం జరిగింది. కానీ కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఆయనను తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారని ఆయనను తీసుకు వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయిన పరిస్థితుల్లో వచ్చారని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి తరలించి సిపిఆర్ అందించామని చెప్పుకొచ్చారు.

20 నిమిషాల పాటు సిపిఆర్ అందిస్తే ఆయన కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారని ఆ తర్వాత ఆయన్ని ఐసియుకు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మా మెరుగైన వైద్యులు చేత మరింత మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నామని మంగళవారం మధ్యాహ్నం మరల మీడియాకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేయాల్సిన హెల్త్ బులిటెన్ సోమవారం రాత్రి మరోసారి విడుదల చేశారు. ఈ హెల్త్ బులిటన్లో కృష్ణగారి ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉందని కార్డియాక్ అరెస్టుతోనే ఆయన హాస్పిటల్ కి వచ్చినా ఇప్పుడు మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తుందని పేర్కొన్నారు.

8 మంది వైద్యులు ఆయనకు నిరంతరం వైద్యం అందిస్తున్నారని ఆయనను ఎక్స్టెన్సివ్ కేర్ యూనిట్లో నిపుణులైన వైద్యులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో పలు అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతిన్నదని కార్డియాక్ అరెస్ట్ వల్ల కిడ్నీలు, లివర్, లంగ్స్, బ్రెయిన్ పై తీవ్రంగా ప్రభావం పడిందని వైద్యులు పేర్కొన్నారు. ఇక కృష్ణకు ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామని మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ఇక కొన్నాళ్ల క్రితం కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ ఏడాది మొదట్లో ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు 2019లో ఆయన రెండో భార్య విజయనిర్మల కన్నుమూశారు. కృష్ణ కుటుంబంలో జరుగుతున్న వరుస విషాదాల నేపథ్యంలో మహేష్ అభిమానులు, కృష్ణ అభిమానులు తీవ్ర ఆందోళన పరిస్థితుల్లో అయితే ఉన్నారు. 24 గంటలు గడిస్తే గాని కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొనడంతో వారంతా టెన్షన్ లో ఉన్నారు.

Also Read: Salaar Movie: ప్రభాస్ కోసం రంగంలోకి ఉడాల్ బాబూరావు.. ఇదేందయ్యా ప్రశాంతూ!

Also Read: Ram Charan Buchi Babu Movie: ఎన్టీఆర్ వద్దనుకున్న కథను ఫైనల్ చేసిన రామ్ చరణ్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News