Simhasanam Movie in 8K Ultra HD Version: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 80`స్ బాహుబలి సింహాసనం` రీ రిలీజ్!
Super Star Krishna Simhasanam Movie To Re Release in 8K Ultra HD Verion: సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సింహాసనం అనే సినిమాను ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలోనే విడుదల చేయని విధంగా 8K అల్ట్రా హెచ్డీ వెర్షన్ లో విడుదల చేయబోతున్నారు.
Super Star Krishna Simhasanam Movie To Re Release in 8K Ultra HD Verion: పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండు ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, ఒక్కడు సినిమాలను రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టింది అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ఘరానా అల్లుడు సినిమా రిలీజ్ చేస్తే కూడా మంచి స్పందన తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి సినిమాలను కూడా రిలీజ్ చేశారు.
అందులో జల్సా సినిమా అయితే ఇప్పటివరకు రీ రిలీజ్ సినిమాల్లో ట్రెండ్ సృష్టిస్తూ సుమారు మూడున్నర కోట్లు దాకా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు మహేష్ బాబు టీం. అదేమిటంటే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సింహాసనం అనే సినిమాను ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలోనే విడుదల చేయని విధంగా 8K అల్ట్రా హెచ్డీ వెర్షన్ లో విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేస్తామని, ప్రస్తుతానికి పాత ప్రింట్లను రిస్టోర్ చేసే ప్రాసెస్ జరుగుతుందని ప్రకటించారు.
ఇక కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 1986లో విడుదలై అప్పట్లో ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పటికే సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ కృష్ణకు ఈ సినిమా మరింత క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఈ సినిమాని 53 రోజుల షెడ్యూల్లో మూడు కోట్ల 50 లక్షల బడ్జెట్ తో పూర్తి చేశారు. ఒక రకంగా ఈ సినిమా అప్పట్లో బాహుబలి రేంజి సినిమా అని చెప్పవచ్చు. అంతేగాక ఈ సినిమా టికెట్ల కోసం థియేటర్ల ముందు అప్పట్లో 12 కిలోమీటర్ల మేర క్యూ కట్టిన చరిత్ర కూడా బహుశా ఈ ఒక్క సినిమాకే చెల్లిందేమో.
ఇక అప్పట్లో రాష్ట్ర రాజధానిగా ఉన్న అప్పటి చెన్నైలో సింహాసనం మూవీ వందరోజుల వేడుక కూడా అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు దాదాపు 400 బస్సులలో హాజరైనట్లు చెబుతూ ఉంటారు. నిజానికి ఈ సినిమాని అప్పట్లోనే మూడున్నర కోట్లు పెట్టి తీయడం ఒక సాహసం. నిజానికి ముందు బయట నిర్మాతలతోనే చేయాలనుకున్నా ఒకవేళ ఫలితం తేడాగా వస్తే బయట నిర్మాతలు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో కృష్ణ ఈ సినిమా తన సొంత బ్యానర్ మీద నిర్మించారు.
దానికి ఆయనే దర్శకత్వం కూడా వహించడం గమనార్హం. ఈ సినిమాలో బాలీవుడ్ నటి మందాకిని సహా జయప్రద, రాధ వంటి వారు నటించారు. ఈ మూవీకి అప్పట్లో ఊహించిన దానికన్నా భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి. మొదటి వారం ఈ సినిమా కోటి 51 లక్షల గ్రాస్ సాధించగా ఒక సింగిల్ థియేటర్ లోనే 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది అంటే ఈ సినిమా ఎంత క్రేజ్ సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక సూపర్ క్రేజ్ ఉన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు మళ్ళీ తీసుకురావాలనుకోవడం కాస్త ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి.
Also Read: Jana Gana Mana Shelved: లైగర్ డిజాస్టర్ రెస్పాన్స్.. 'జనగణమన'కు మంగళం
Also Read: Bandla Ganesh on Jr NTR: వివాదంపై స్పందించిన బండ్ల.. ఎన్టీఆర్ ను కూడా ప్రేమిస్తున్నానంటూ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి