Superstar Krishna Viral Photo: సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారడం.. అందులో ఆయన ముఖంలో కొన్ని తేడాలు కనిపించడంతో... కృష్ణకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వయోభారం కారణంగా కృష్ణ పెద్దగా బయటకు రావట్లేదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ తన సోదరుడు ఆది శేషగిరిరావుతో కలిసి భోజనం చేస్తుండగా తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఫోటో తీసింది మరెవరో కాదు.. కృష్ణ తనయ మంజుల. ఆ ఫోటోలో కృష్ణ ముఖమంతా తెల్లని మచ్చలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అది చూసిన ఫ్యాన్స్ ఆయన ముఖానికి ఏమైంది... ఎందుకలా అయ్యారని ఆందోళన చెందుతున్నారు. కృష్ణకు ఏమైందంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నట్లుగా కృష్ణకు ఏమీ కాలేదు. ముఖానికి ఇన్విజిబుల్ మాస్క్ ధరించడం వల్ల.. ఫోటోలో అది చర్మంలో కలిసిపోయినట్లుగా కనిపించింది. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యంగా ఉన్నారని... ఎంతో చురుగ్గా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 


ఇటీవల ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఇలాగే వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆయనకేమైందని చాలామంది ఆందోళన చెందారు. చివరకు వెంకటేశ్వరరావు సోదరుడు గోపాలకృష్ణ  దీనిపై తన యూట్యూబ్ చానెల్ ద్వారా స్పందించారు. వయోభారం కారణంగా అలా కనిపిస్తున్నారని... అంతే తప్ప ఆయన ఆరోగ్యానికి ఏమీ కాలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఆయన చురుగ్గా ఉన్నారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. 


Also Read: KGF Chapter 2 OTT Release Date: అభిమానులకు గుడ్ న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!


Also Read: Horoscope Today April 15 2022: రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook