Horoscope Today April 15 2022: రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి

Horoscope Today  April 15 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి అన్ని నిర్ణయాలు కలిసొస్తాయి. మరికొన్ని రాశులవారికి ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 11:59 AM IST
  • నేటి రాశి ఫలాలు.. కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు
  • కొన్ని రాశుల వారికి అన్ని నిర్ణయాలు కలిసొస్తాయి
  • ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today April 15 2022: రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి

Horoscope Today April 15 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి అనుకూల సమయం. తద్వారా వారు చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మరికొన్ని రాశుల వారికి ఇది ప్రతికూల సమయం. కాబట్టి వారికి సహనం, ఓర్పు అవసరం. లేనిపక్షంలో చిక్కుల్లో పడుతారు. ఇవాళ్టి రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి. 

మేషరాశి ( Aries) 

వృత్తిరీత్యా ఇవాళ అంతగా కలిసిరాకపోవచ్చు. మీ వద్ద ఉన్న డబ్బును జాగ్రత్తగా పెట్టుబడుల రూపంలోకి మలచాలి. ఇష్టారీతిన డబ్బును వెదజలవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సామాజికంగా మీ పలుకుబడి మునుపటి లాగే ఉంటుంది. మీ డైట్‌లో కొన్ని మార్పులు చేర్పులు అవసరం. అవి మీ ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి. విద్యార్థులు తమ స్టడీపై ఎక్కువగా  ఫోకస్ చేయాలి.

వృషభ రాశి (Taurus)

మీరు చేపట్టిన ప్రాజెక్ట్ ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిపరంగా తప్పులు జరగకుండా చూసుకోగలరు. తద్వారా మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యానికి సంబంధించి ఫిజికల్ వర్కౌట్స్‌పై దృష్టి సారించాలి. మీ బంధువు ఒకరిని వారి స్వగ్రామంలో దిగబెట్టే బాధ్యత తీసుకుంటారు. ఇటీవల మీరు కొత్తగా కొనుగోలు చేసిన ప్రాపర్టీని కుటుంబంతో కలిసి సందర్శిస్తారు.

మిథున రాశి (GEMINI)

ఏ పనైనా సరే ఆచీ తూచీ వ్యవహరించాలి. ఆర్థిక పర్యవసనాలు దృష్టిలో ఉంచుకుని ఏ పనైనా మొదలుపెట్టాలి. ఆరోగ్యం బాగుంటుంది. అయితే పూర్తి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంటికి సంబంధించిన ఓ విషయం కాస్త కలత చెందేలా చేస్తుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

కర్కాటక రాశి (Cancer) 

పెరుగుతున్న ఖర్చులు మరిన్ని ఆదాయ మార్గాలపై దృష్టి సారించేలా చేస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే అంత సీరియస్‌ ఏమీ కాదు. వృత్తిపరంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. తద్వారా రికార్డ్ టైమ్‌లో టాస్క్ పూర్తి చేస్తారు. కొత్త ఇల్లు లేదా షాప్ కొనుగోలు చేయాలన్న కోరిక ఇప్పుడప్పడే నెరవేరదు. అకడమిక్ రంగంలో ఉన్నవారు ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకు తగినట్లే ఫలితాలు కూడా పొందుతారు.

సింహ రాశి (LEO)

మీకు అందాల్సిన మొండి బకాయిలు అందుతాయి. దాంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో తప్పుడు సలహాలు, సూచనలు పాటించవద్దు. వృత్తిపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబం జీవితం సాఫీగా సాగుతుంది. ప్రాపర్టీ కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరేందుకు మరింత సమయం పడుతుంది. అకడమిక్ పరంగా మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు అందుకు తగిన ప్రిపరేషన్ అవసరం.

కన్య రాశి (Virgo)

మీ సన్నిహితులతో బంధం మరింత ధృఢపడుతుంది. వృత్తిపరమైన ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలను బాగా ఆస్వాదిస్తారు. ఇల్లు కోసం చూస్తున్నవారికి మంచి ఇల్లు దొరికే అవకాశం ఉంది. అకడమిక్ రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది. వ్యక్తిగత, కుటుంబం జీవితం సాఫీగా సాగుతుంది. మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతారు.

తులా రాశి (Libra)

వృత్తిపరంగా మీ కొలిగ్ సలహాలు, సూచనలు కీలకవుతాయి. ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. మీ స్నేహితుడు ఇచ్చే ఫిట్‌నెస్ సలహా అద్భుతంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్నపాటి పేచీలు తొలగిపోతాయి. ఒకవేళ మీరు కుటుంబంతో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అది మీకు బాగా కలిసొస్తుంది. అకడమిక్ పరంగా అనుకూల సమయం.

వృశ్చిక రాశి (Scorpio)

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి నైపుణ్యం కలిగినవారికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. మీతో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారితో మరింత సరదాగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి తగిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ కలను నెరవేర్చుకునేందుకు ఇది అనువైన, అనుకూల సమయం. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఆర్థికంగా అంతగా కలిసిరాకపోవచ్చు. రెగ్యులర్ వర్క్ నుంచి కాస్త  బ్రేక్ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఇంటికి సంబంధించి చాలాకాలంగా పెండింగ్‌లో ఉంచిన పనులు ఇప్పుడు చేపట్టడం మంచిది. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. బంధువులు మీ నుంచి సహాయాన్ని ఆశిస్తారు. 

మకర రాశి (Capricorn) 

ఇవాళ అటు వృత్తిపరంగా, ఇటు కుటుంబపరంగా ఆశాజనకంగా సాగకపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు మంచివి కావు. అవి మీ వైవాహిక బంధంపై ప్రభావం చూపుతాయి. వ్యాపార భాగస్వామితో వివాదాలు పక్కనపెట్టండి. సింగిల్స్ వివాహానికి సంబంధించిన విషయాల్లో హడావుడి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో చర్చించే ముందుకు సాగాలి.

కుంభ రాశి (Aquarius)

వ్యాపారంలో కొత్త స్ట్రాటజీలను అమలుచేస్తారు. సోషల్ గెట్ టు గెదర్ ద్వారా మీ పలుకుబడి మరింత పెరగవచ్చు. అది మీ పరిచయాలు, సంబంధాలను మరింత విస్తృతం చేస్తుంది. కుటుంబం లేదా బిజినెస్ ట్రిప్‌పై సుదూర ప్రాంతాలకు వెళ్తారు. అది మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చుల జోలికి వెళ్లవద్దు. 

మీన రాశి (Pisces) 

వృత్తిరీత్యా కలిసొస్తుంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అప్పులు చేయడం మానుకోండి. చిన్న చిన్న విషయాలు సైతం మీ మానసిక స్థితిని ప్రభావం చేస్తాయి. అవి ఇంటి దాకా వస్తే కుటుంబ వాతావరణం దెబ్బతింటుంది. ఆస్తి విషయంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పూర్తి పట్టుదల మరియు సంకల్పంతో ముందుకు సాగుతారు.

Also Read: Ranbir Alia Wedding: ఇట్స్ అఫీషియల్.. ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి అయిపోయింది

Also Read: Also Read: KGF Chapter 2 OTT Release Date: అభిమానులకు గుడ్ న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News