Super Star Mahesh Babu and Sithara For Dance India Dance Telugu: జీ తెలుగు ఇప్పటికే అనేక రియాలిటీ షోలు నిర్వహించి వాటి ద్వారా సినీ పరిశ్రమకు సరికొత్త గాయనీ గాయకులను,  అనేక మంది డాన్స్ కొరియోగ్రాఫర్ లను అందించి మంచి పేరు సంపాదించింది. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న జీ తెలుగు ఇప్పుడు ఒక సరికొత్త డాన్స్ రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా పేరుగాంచిన 'జీ నెట్వర్క్'కు సంబంధించిన ప్రీమియం రియాలిటీ షో ''డాన్స్ ఇండియా  డాన్స్'' తెలుగు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఆ ప్రోగ్రాం లేటెస్ట్ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమార్తె సీతారతో కలిసి పాల్గొన్నారు. దానికి సంబందించిన ప్రోమో విడుదలయింది. ఇక తన కుమార్తెతో కలిసి మహేష్ బాబు మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రోమోలో మహేష్ మాట్లాడుతూ తనకు తెలిసి డాన్స్ అనేది ఒక సెలబ్రేషన్ అని అన్నారు.


ఇక సితార అక్కడ ఉన్న డ్యాన్సర్ లతో కాలు కదిపింది. తన కుమార్తెతో కలిసి ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉందని మహేష్ పేర్కొన్నారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, 'డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు' షో కి విచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు & ప్రిన్సెస్ సితార, ఈ ఆదివారం ఎపిసోడ్ దద్దరిల్లిపోద్ది అంటూ ప్రోమో విడుదల చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం అది మీరు కూడా చూసేయండి మరి. 



Also Read: Balakrishna Worst Movies: బాలకృష్ణ ఖాతాలో కొత్త రికార్డు.. టాప్ టెన్ చెత్త సినిమాల్లో నాలుగు బాలయ్యవే!


Also Read: Vijay Deverakonda Fans: సమంతపైనే లైగర్ ఫ్యాన్స్ ఆశలు.. అంతా ఆమె చేతుల్లోనే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి