Mahesh Vijay Combo: క్రేజీ కాంబినేషన్.. ఒకే స్క్రీన్‌పై సూపర్ స్టార్స్ మహేష్ బాబు, విజయ్..?
Mahesh Babu in Thalapathy Vijay`s Movie: సౌత్ సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. దీంతో దర్శకులు మల్టీస్టారర్ కథల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నుట్లు తెలుస్తోంది.
Mahesh Babu in Thalapathy Vijay's Movie: ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం ఎలా ఉంటుంది.. ఆ ఫీలింగ్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులు ఆ థ్రిల్లింగ్ ఫీల్‌ను ఎంజాయ్ చేశారు.లేటెస్ట్ రిలీజ్ విక్రమ్ సినిమాలోనూ కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి దిగ్గజ నటులను ఒకే తెరపై చూసి థ్రిల్లింగ్‌కి గురయ్యారు. ఒకరకంగా ఇటీవలి కాలంలో సౌత్‌లో మల్టీస్టారర్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇదే పరంపరలో త్వరలోనే మరో ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరు మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో సూపర్ స్టార్ దళపతి విజయ్. విజయ్ 66వ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో మహేష్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మహేష్‌కు మహర్షి లాంటి బ్లాక్‌బ్లస్టర్ హిట్ ఇచ్చిన వంశీ.. విజయ్ సినిమాలో గెస్ట్ పాత్రకు మహేష్‌ను ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. అంతేకాదు, తెలుగులో విజయ్ తన మార్కెట్‌ను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడవచ్చు.
విజయ్ సినిమాలో మహేష్ పాత్రపై ఇప్పటికైతే వంశీ పైడిపల్లి నుంచి కానీ మేకర్స్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. విజయ్ చివరి సినిమా 'బీస్ట్' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమా రూ.100 కోట్లు వరకు వసూలు చేయడం విశేషం. విజయ్ చివరి సినిమా ఫ్లాప్ అవడంతో.. ఆయన నుంచి మరో సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విజయ్-వంశీ పైడిపల్లి మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర..
Also Read: Budh Gochar Laabh: వృషభరాశిలో బుధుడి సంచారం.. జూలై 2 వరకు ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook