Murari Vaa Video Song: మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. 'మురారి వా' వీడియో సాంగ్ వచ్చేసింది!

Murari Vaa Video Song released form Sarkaru Vaari Paata. 'మురారి వా' పాట వీడియో సాంగ్‌ను బుధ‌వారం (జూన్ 7) ఉద‌యం 11.07 నిమిషాల‌కు యూట్యూబ్‌లో విడుదల చేశారు ఎస్‌వీపీ మేకర్స్.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 01:38 PM IST
  • మహేష్ బాబు అభిమానులకు శుభవార్త
  • మురారి వా వీడియో సాంగ్ వచ్చేసింది
  • ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా కీర్తి గ్లామ‌ర్
Murari Vaa Video Song: మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. 'మురారి వా' వీడియో సాంగ్ వచ్చేసింది!

Murari Vaa Video Song released form Sarkaru Vaari Paata: టాలీవుడ్ 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు హీరోగా వచ్చిన 'సర్కారు వారి పాట' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబుకి సరైన కంటెంట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో ఎస్‌వీపీ నిరూపించింది. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎస్‌వీపీ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమాలో మ‌హేష్‌ క్యారెక్ట‌రైజేష‌న్‌, ఎన‌ర్జీ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంది. అందుకే బాబు స్వాగ్‌ను వెండితెరపై ఆస్వాదించేందుకు సినీ ప్రియులు ఇప్పటికీ థియేటర్లకు వెళుతున్నారు.

ఎఫ్‌3’, మేజ‌ర్‌, విక్ర‌మ్ సినిమాలు విడుద‌ల‌వ‌డంతో 'స‌ర్కారు వారి పాట' స్పీడుకు బ్రేకులు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు 'మురారి వా' అనే మెలోడి సాంగ్‌ను మేకర్స్ యాడ్ చేశారు. ఎడిటింగ్‌లో తొలగించిన ఈ పాట‌ను ఇటీవ‌లే థియేట‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌లో యాడ్ చేశారు. అయితే ఎస్‌వీపీ ఇటీవ‌లే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో అద్దెకు విడుద‌ల కాగా.. అందులో ఈ పాట లేదు. దాంతో మేహేష్ బాబు ఫాన్స్ కాస్త‌ నిరాశ చెందారు.

'మురారి వా' పాట వీడియో సాంగ్‌ను బుధ‌వారం (జూన్ 7) ఉద‌యం 11.07 నిమిషాల‌కు యూట్యూబ్‌లో విడుదల చేశారు ఎస్‌వీపీ మేకర్స్. ఈ వీడియోకి ఇప్పటికే 4 లక్ష్యలకు పైగా వ్యూస్ వచ్చాయి. మురారి వా సాంగ్ కోసం మేకర్స్ భారీ సెట్టింగ్ వేశారు. పాటలో మహేశ్‌ బాబు, కీర్తి సురేష్ బాగా డాన్స్ చేశారు. పాట‌లో కీర్తి గ్లామ‌ర్ ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. ఇప్ప‌టికే ఎస్‌వీపీ సినిమాలోని అన్ని వీడియో సాంగ్స్ రిలీజ్ అయిన విష‌యం తెలిసందే. 

ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్‌వీపీ చిత్రంను 14రీల్స్ ఎంట‌ర్టైనమెంట్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ల‌తో క‌లిసి మ‌హేష్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో మహేశ్‌ బాబు సరసన కీర్తి సురేష్ నటించారు. ఎస్‌వీపీ చిత్రంలో సూపర్ స్టార్ చాలా స్టైలీష్‌గా కనిపించడంతో పాటు కామెడీ, యాక్షన్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా మహేష్, కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, నాగబాబు, తనికెళ్ల భరణి, నదియ, సముద్రఖని, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Also Read: Feng Shui Tips: ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేయాలంటే.. ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటించండి!

Also Read: Amazon Smart Phone Offers: అమెజాన్ బంపరాఫర్... రూ.8వేలు విలువ చేసే రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.399కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News