Mahesh Babu-Sitara:  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డ్యాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్ టాలెంట్‏తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకుంది. ఢిపరెంట్ వీడియోలతో నెటిజన్స్ ఆకట్టుకోవడం సితార (Sitara Ghattamaneni) స్టైల్. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాలోని సాంగ్ కు తనదైన శైలిలో స్టెప్పులేసి మెస్మైరైజ్ చేసింది సితార. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట' (Sarkaru vaari paata) . కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్ (kalaavathi song) యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. ఇందులో మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నాడు.


తాజాగా కళావతి సాంగ్ కు డ్యాన్స్ చేసింది సితార. ఈ వీడియోను మహేష్ తన ఇన్‏స్టాలో (Instagram) షేర్ చేస్తూ..కూతురిపై ప్రశంసలు కురిపించాడు. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  ఈ వీడియోపై  మహేష్ సతీమణి నమ్రత కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా ఏం చెప్పగలను ?.. లవ్ యూ మై లిటిల్ వన్ అంటూ ట్యాగ్ చేశారు. సితార డ్యాన్స్ కు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 



Also Read: Bheemla nayak trailer: భీమ్లా నాయక్ ట్రైలర్​పై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook