Super Star Mahesh Babu is the next chief guest on Jr NTRs Evaru Meelo Koteeswarulu: తెలుగు బుల్లి తెరపై ప్రసారమౌతున్న క్రేజీ ప్రోగ్రాం ఎవరు మీలో కోటీశ్వరులు అందరిని అలరిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Young Tiger NTR) హోస్ట్ గా చేస్తోన్న ఈ కార్యక్రమం ఆకట్టుకుంటోంది. ఇక ఈ షోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా సందడి చేయనున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో (Social media) చర్చ సాగింది. ఈ విషయంపై ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గెస్ట్‌గా (Maheshbabu guest).. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా (NTR host) సాగే ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Kotiswarulu) ఎసిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతోన్న రియాల్టీ గేమ్‌ షో (Reality Game‌ Show) ఎవరు మీలో కోటీశ్వరులు.. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ సాగుతోంది. 


ఈ గేమ్‌ షోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Superstar Maheshbabu) సందడి చేశారు.. షోలో భాగంగా ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలోనే టెలికాస్ట్ (Telecast) కానుంది. ఈ విషయంపై కన్ఫర్మేషన్ వచ్చేసింది. సోషల్ మీడియాలో స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్ అయ్యింది. 



 


Also Read : ఖబడ్దార్... విర్రవీగితే మెడలు వంచుతాం... వైసీపీ నేతలకు నందమూరి బాలకృష్ణ వార్నింగ్


ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ గేమ్‌ షోలో ఇప్పటి వరకు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. వారు గెలుచుకున్న మొత్తాన్ని ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించారు. రామ్‌చరణ్‌, రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, సమంతలు ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ బాబు (Maheshbabu), ఎన్టీఆర్ ల (NTR) ఎపిసోడ్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read : అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్‌కు బ్రేక్.. కారణం అదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook