అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్‌కు బ్రేక్.. డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి కరోనా

Surender Reddy and his family tests positive for COVID19:. మొన్నటి వరకు ఆయ‌న అఖిల్ తో.. ఏజెంట్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కోసం ఏజెంట్ (Agent Movie) యూనిట్ హంగేరి వెళ్లింది. కొన్నాళ్ల పాటు.. బుడాపెస్ట్‌లో అఖిల్ ఏజెంట్ షూటింగ్ జ‌రిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 12:28 PM IST
  • డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌
  • మొన్నటి వరకు అఖిల్ తో.. ఏజెంట్ మూవీ షూటింగ్‌లో బిజీ
  • షూటింగ్‌ కోసం హంగేరి వెళ్లిన ఏజెంట్ యూనిట్
  • సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంతో తాజా షెడ్యూల్ షూట్ కు అంతరాయం
అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్‌కు బ్రేక్.. డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి కరోనా

Akkineni Akhil Agent Movie Director Surender Reddy and his family tests positive for COVID19: డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు సమాచారం. మొన్నటి వరకు ఆయ‌న అఖిల్ తో.. ఏజెంట్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కోసం ఏజెంట్ (Agent Movie) యూనిట్ హంగేరి వెళ్లింది. కొన్నాళ్ల పాటు.. బుడాపెస్ట్‌లో అఖిల్ ఏజెంట్ షూటింగ్ జ‌రిగింది. 

అయితే సురేందర్ రెడ్డితో పాటు అతని ఫ్యామిలీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తాజా షెడ్యూల్ షూట్ కు అంతరాయం ఏర్పడింది. సురేందర్ రెడ్డి (Surender Reddy), అతని కుటుంబ సభ్యులు ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో (Quarantine‌) ఉన్నారు.

ఇక ఏజెంట్ మూవీ యూనిట్ అంతా కూడా ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. గత రెండు వారాల పాటు అఖిల్, మమ్ముట్టిలపై కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Director Surender Reddy) కరోనా (Covid) నుంచి పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ అఖిల్ మూవీ షూటింగ్ మొదలుకానుంది. అప్పుడే పెండింగ్‌లో ఉన్న పార్ట్‌లను మళ్లీ షూట్ చేస్తారు.

Also Read : మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని.. కాళ్లపై పడి.. తరువాతేం జరిగింది..??

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఏజెంట్ మూవీ తెరకెక్కుతోంది. విభిన్నమైన కథ, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నారని టాక్. 
ఇప్పటికే విడుదలైన ఏజెంట్ మూవీ పోస్టర్‌... సినిమాపై కాస్త ఎక్కువ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈ మూవీలో అఖిల్‌ ఓ సీక్రెట్ ఏజెంట్‌గా (Secret Agent‌) సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. సాక్షి వైద్య ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) ఓ సినిమా చేయ‌నున్నారు.

Also Read : వర్షాల ఎఫెక్ట్​: నేడు శమరిమల ఆలయానికి భక్తుల సందర్శనలు రద్దు

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x