Pelli SandaD: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాలో శ్రీలీల(sri leela ) హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తుండగా… కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గత పెళ్లి సందడి చిత్రానికి సీక్వెల్ కాదని ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకా,ల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 


Also read: Bheemla Nayak Blitz: భీమ్లా నాయక్.. డానియల్ శేఖర్‌ వచ్చేశాడు.. నేనెవరో తెలుసా? హీరో అంటూ పవర్​ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టిన రానా


ఇటీవల అక్కినేని నాగార్జున చేతులమీదుగా 'పెళ్లి సందD' టీజర్ రిలీజ్ చేయగా.. తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. రేపు ( 22న )ఉదయం 11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Superstar Mahesh babu) చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించనున్నారు. ‘పెళ్లి సందడి’(Pelli Sandadi Movie) సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతాన్ని ఇందించారు. ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా రోషన్ కు ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook