Jailer Trailer: రజినీ మార్క్ డైలాగ్స్, యాక్షన్ తో ‘జైలర్’ మూవీ ట్రైలర్.. మీరు చూసేయండి..
Rajinikanth Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ జైలర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం రజినీ మార్క్ డైలాగ్స్, యాక్షన్ తో నిండిపోయింది.
Jailer Trailer Released: సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth), తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'జైలర్'(Jailer Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, సీనియర్ నటి రమ్యకృష్ణ, సునీల్, జాకీ ష్రాప్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా 'షోకేస్' పేరిట ట్రైలర్ ను తమిళంతోపాటు తెలుగు భాషలోనూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇది ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదిరింది. “ఒకరేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే” అంటూ రజినీ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. టాలీవుడ్ నటుడు సునీల్ కాస్త డిఫరెంట్ గెటప్‍లో కనిపించాడు. అయితే ఈ ట్రైలర్ ఎక్కడా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలను లీక్ చేయకపోవడం విశేషం.
Also Read: Sardar 2 update: బిజీ బిజీగా కార్తీ.. సర్దార్ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్..
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. జైలర్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. కావాలా సాంగ్ .. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇందులో తమన్నా ఎన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. మరోవైపు ఈసినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని రజినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Karthik Aaryan: పారాలింపిక్ ఛాంపియన్ బయోపిక్‌లో కార్తిక్ ఆర్యన్.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook