Karthik Aaryan: పారాలింపిక్ ఛాంపియన్ బయోపిక్‌లో కార్తిక్‌ ఆర్యన్‌.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్‌ లుక్‌..

Karthik Aaryan: బాలీవుడ్‌లో గత కొద్ది కాలంగా  కార్తిక్‌ ఆర్యన్‌ హవా నడుస్తోంది. ఇతడు రీసెంట్ గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈసారి ఈ హీరో బయోపిక్ తో వస్తున్నాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 10:04 AM IST
Karthik Aaryan: పారాలింపిక్ ఛాంపియన్ బయోపిక్‌లో కార్తిక్‌ ఆర్యన్‌.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్‌ లుక్‌..

Chandu Champion Movie First Look: భారతీయ సినీ చరిత్రలో గత కొద్దికాలంగా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ తోపాటు తెలుగులోనూ ఈ మధ్యకాలంలో బయోపిక్స్ సందడి చేశాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌(Karthik Aaryan) ఓ గోల్డ్ మెడలిస్ట్ బయోపిక్‌లో నటించేందుకు రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. షార్ట్‌ హేయిర్‌ కట్‌తో ఉన్న కార్తిక్‌ పోస్టర్ మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి యంగ్ హీరో కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'చందు చాంపియన్‌' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీ స్పోర్స్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారు. అయితే ఇది ఎవరి బయోపిక్‌ అనేది క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. 

ఇండియా తొలి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. 1972లో పారాలింపిక్స్‌లో మురళీకాంత్ గోల్డ్ మెడల్ సాధించారు. అంతేకాకుండా ఈయనను 2018లో పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఇక ఆయన బయోపిక్ నే చందు చాంపియన్ అనే పేరుతో సినిమా తీసుస్తున్నారని హిందీ ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే. 

‘'ప్యార్‌ కా పంచుమా'’ అనే సినిమాతో బాలీవుడ్ లో ఆరంగ్రేటం చేసిన హీరో కార్తిక్ ఆర్యన్. ప్రస్తుతం ఇతడి కెరీర్ ఫిక్స్ లో ఉంది. వరుస విజయాల సాధిస్తూ స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోయాడు కార్తిక్. 2017లో ‘'సోను కే టిట్లు కీ స్వీటీ' అనే సినిమాతో మెుదలైన విజయపరంపర.. ఇటీవల వచ్చిన  'సత్య ప్రేమ్‌ కీ కథ' వరకు సాగింది. ’ఇతడు నటించిన 'లుకా చుప్పి'’, ‘'పతి ఔర్ పత్నీ వో'’,  'భూల్‌ భూలయ్య-2' వంటి సినిమాలు వంద కోట్లు మార్కును దాటాయి.

Also Read: Samajavaragamana OTT: ఓటీటీలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న 'సామజవరగమన'.. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News