Sardar 2 update: బిజీ బిజీగా కార్తీ.. సర్దార్‌ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్..

Sardar 2 Movie: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ  ప్రస్తుతం జపాన్ సినిమాతోపాటు సర్దార్ సీక్వెల్ లోనూ నటిస్తున్నాడు.  సర్దార్ 2 సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 05:01 PM IST
Sardar 2  update: బిజీ బిజీగా కార్తీ.. సర్దార్‌ 2 నుంచి అదిరిపోయే అప్ డేట్..

Sardar 2 Movie update: తమిళ స్టార్ హీరో కార్తీ నుంచి వచ్చిన సర్దార్ సినిమా గతేడాది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి స్వీక్వెల్ రాబోతుంది. మిషన్‌ కంబోడియా త్వరలో మొదలవుతుంది.. అని మేకర్స్‌ ఇప్పటికే సర్దార్‌ 2 (Sardar 2) అప్‌డేట్‌ వీడియోను షేర్ చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలయ్యాయట. పీఎస్ మిత్రన్‌ (PS Mithran) దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్‌ కు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పార్ట్‌ 1కు జీవీ ప్రకాశ్ కుమార్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ పనిచేశారు. ప్రిన్స్ పిక్చర్స్  సంస్థ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో స్టార్ హీరో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నాడు. 

ప్రస్తుతం కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కార్తీ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం జపాన్‌ (Japan). ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనూ ఎమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి కూడా జీవీ ప్రకాశ్‌నే స్వరాలు సమకూరుస్తున్నారు.  డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కార్తి లుక్ డిఫరెంట్ గా ఉంది. ఈ మూవీని దీపావళికి విడుదల చేయనున్నారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా కార్తి 26 కూడా మెుదలయింది.  96 ఫేం ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో కార్తీ 27 (Karthi 27) చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కార్తీ పుల్ బిజీ అయిపోయాడు. 

Also Read: Tantra Movie: 'తంత్ర'గా వస్తున్న అనన్య నాగల్ల.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్ అదిరింది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News