Suriya has announced deposit Rs 10 lakh in the name Parvathi Ammal: తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. జై భీమ్ సినిమాలో సినతల్లి క్యారెక్టర్​కు ఇన్స్​ప్రెషన్​ అయిన.. పార్వతి అమ్మళ్​కు ఆర్థిక సహాయం (Suriya help to Parvathi Ammal) అందించాలని నిర్ణయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవిక ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా 'జై భీమ్‌'(Jai bhim). నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్​లో విడుదలై అన్ని వర్గాల నుంచి మంచి స్పందనను దక్కించుకుంది.


కులతత్వం, పోలీసుల క్రూరత్వం, సమాజంలో మానవ హక్కులు ఏ విధంగా హరించివేయబడుతున్నాయనే అంశం నేపథ్యంలో ఈ సినిమా కథ (Jai Bhim story) సాగుతుంది. ఈ సినిమాపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. సినిమా మొత్తం సినతల్లి, రాజన్నల కోణంలోనే సాగుతుంది.


సినతల్లి భర్తను పోలీసులు అరెస్టు చేసి.. లాకప్​ డెత్​ చేస్తారు పోలీసులు. అది కప్పి పుచ్చుకునేందుకు పోలీసులు, పోలీసుల తరఫు న్యాయవాధుల ప్రయత్నిస్తుంటారు. వారిని ఎదుర్కొనే క్రమంలో సినతల్లి పడే కష్టాలు, వారికి సహాయం చేసే పాత్ర (చంద్రూ)లో సూర్య చేసే ప్రయత్నాలు అందరి మనసులు కదిలిస్తాయి.


Also read: Natu natu song dance viral videos: నాటు నాటు పాటకు ట్రాఫిక్ సిగ్నల్లో నాటు స్టెప్పులు


ఇందులో సినతల్లి పడిన కష్టాలను నిజజీవితంలో అప్పట్లో పార్వతి అమ్మల్ నిజంగానే ఎదుర్కొన్నారు. అమె ఇప్పటికీ ఇంకా పేదరికంలోనే ఉన్నారు. దీనితో అమెకు సహాయంగా రూ.10 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయాలని సూర్య నిర్ణయించుకున్నారు.


ఇప్పటికే గిరిజనుల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్​కు అందిచారు సూర్య. ఆయన భార్య జ్యోతికతో కలిసి ఈ సహాయాన్ని అందించాడం గమనార్హం.


Also read: Gangubai Kathiawadi Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘గంగూబాయి’


Also read: Samantha item song in Pushpa: పుష్ప మూవీలో సమంత ఐటం సాంగ్


ఇంటిని నిర్మిస్తానని లారెన్స్ హామి..


నటుడు, దర్శకుడు, డ్యాన్సర్ లారెన్స్(Raghava Lawrence) కూడా ఈ సినిమా చూసి చలించిపోయారు. ఆమె కష్టాలు ఇంకెవరికి రావొద్దని ఇటీవల పేర్కొన్నారు. అమెకు ఇంటిని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.


జై భీమ్​ సినిమాకు.. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్యతో పాటు, ప్రకాశ్ రాజ్ (పోలీస్ ఆఫీసర్)​, రావు రమేశ్​ (ప్రభుత్వం తరఫు న్యాయవాది), లిజోమోల్ జోసీ (సినతల్లి), మణికంఠన్ (రాజన్న) ప్రధాన పాత్రదారులు. ఈ సినిమాకు నిర్మాతలుగా సూర్య, జ్యోతికలు వ్యవహరించడం గమనార్హం.


Also read: Vikram, Vijay Sethupathi: కమల్​ కథతో.. విక్రమ్​, విజయ్​ సేతుపతి మల్టీ స్టారర్​!


Also read: Mahesh-Rajmouli Combo: సమంత 'దూకుడు'.. మహేష్-జక్కన్న సినిమాలో హీరోయిన్‌గా సామ్..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook