ET Telugu Official Teaser: తమిళ నటుడు సూర్య (Suriya) నటిస్తున్న తాజా చిత్రం 'ఈటి' (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ (Etharkkum Thunindhavan) తెరకెక్కుతోంది. హీరోయిన్ గా  ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) నటిస్తోంది. ఇందులో సత్యరాజ్, జయప్రకాశ్, వినయ్‌రామ్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు టీజర్ (Teaser)ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో  ‘నాతో ఉన్న వాళ్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’ అంటూ సూర్య చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఆకాశమే హద్దురా, ‘జై భీమ్‌’ చిత్రాల తర్వాత సూర్య నటిస్తున్న చిత్రం 'ఈటి'. ఈ సినిమాపై భారీగా అంచనాలే ఉన్నాయి. టీజర్ చూస్తుంటే మాస్ మూవీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ కి సూర్య స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. 



ఆకాశమే హద్దురా, ‘జై భీమ్‌’ చిత్రాలలో తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ చిత్రాలు సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలు ఆస్కార్ రేసులో కూడా నిలిచాయి. 


Also Read: Bheemla nayak event: భీమ్లా నాయక్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​​ 21న ఫిక్స్​- ముఖ్య అతిథిగా కేటీఆర్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook