Bheemla nayak event: భీమ్లా నాయక్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​​ 21న ఫిక్స్​- ముఖ్య అతిథిగా కేటీఆర్​

Bheemla nayak pre release: పవన్​ కల్యాణ్​, రానాలు ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ మూవీ​ ప్రీ రిలీజ్ ఈవెంట్​పై మరో క్రేజీ అప్​డేట్​ వచ్చింది.  తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 01:57 PM IST
  • భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్ తేదీ ఫిక్స్​!
  • ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్!
  • అధికారికంగా వెలువడాల్సి ఉన్న ప్రకటన
Bheemla nayak event: భీమ్లా నాయక్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​​ 21న ఫిక్స్​- ముఖ్య అతిథిగా కేటీఆర్​

Bheemla nayak pre release: తెలుగు రాష్ట్రాల్లో సినీ లవర్స్ ఎంతగానో  ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ మూవీకి సంబంధించి మరో భారీ అప్​డేట్ వచ్చింది. సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​పై  సందిగ్ధత వీడింది. ఈ నెల 21న సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది.

ఈవెంట్​ ఎక్కడంటే..

యూసఫ్​గూడాలోని పోలీస్​ గ్రౌండ్స్​లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 21 సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ప్రారంభం కానున్నట్లు తెలిసింది.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్​ గెస్ట్​లకు సంబంధించి కూడా భారీ లిస్ట్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  అగ్రహీరో మహేశ్​ బాబు, దర్శక ధీరుడు రాజమౌలి, నందమూరి నట సింహం బాలకృష్ణ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం. అయితే ఆ అంచనాలన్నీ తప్పయ్యాయి.

అయితే ఈ సారి సినిమా రంగం నుంచి కాకుండా రాజకీయ నాయకుల్లో ఒకరిని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్​గా పిలిచింది చిత్ర బృందం. యూత్​లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్​ను ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా భీమ్లా నాయక్​ టీమ్​ ఆహ్వానించగా.. ఇందుకు ఆయన కూడా ఓకే చెప్పారు.

ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్మెంట్స్​ అధికారికంగా ప్రకటన కూడా చేసింది. 

ఈ నెల 25న భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్​ పూర్తయింది. అయితే ఇంకా ట్రైలర్ మాత్రం విడుదల చేయలేదు చిత్ర యూనిట్​. ఈ విషయంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు కూడా.

మరి ట్రైలర్​ను కూడా ప్రీ రిలీజ్​ రోజే విడుదల చేస్తారా? లేదా ఫ్యాన్స్​ను శాంతింపజేసేందుకు ముందుగానే ట్రైలర్​ను రిలీజ్ చేస్తారా? అనేది వేచి చూడాలి.

భీమ్లా నాయక్ సినిమాలో పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటిలు ముఖ్యపాత్రాదారులు. నిత్యామీనన్​, సంయుక్తా మీనన్​లు హీరోయిన్లు.

Also read: Alia Bhatt Bathtub Pics: బాత్‌టబ్ ఫోటోలతో హాట్ హాట్‌గా అలియా భట్

Also read: Bheemla Nayak Pre-release Event: 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రేజీ గెస్ట్స్...నెట్టింట వైరల్ అవుతున్న లిస్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News