Tollywood: ఈ రెండు సినిమాలు డిజాస్టర్ దిశగా.. ఆ ఇద్దరు హీరోలకు పండగే..!
Kanguva vs Matka collections: దీపావళి సందర్భంగా విడుదలైన.. మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి. లక్కీ భాస్కర్, క, అమరన్.. మూడు కూడా చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ అందుకున్నాయి. ఈ మూడు సినిమాలలో అమరన్ తమిళ్ డబ్బింగ్ చిత్రం కాగా.. లక్కీ భాస్కర్, క సినిమాలు తెలుగులో విడుదలై.. మిగతా భాషల్లోకి డబ్బింగ్ అయ్యాయి.
Lucky Bhaskar vs KA collections: అమరన్, లక్కీ భాస్కర్, క.. మూడు సినిమాలు కూడా దీపావళికి విడుదలై అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అమరన్ ఏకంగా 150 కోట్లు క్రాస్ చెయ్యగా.. లక్కీ భాస్కర్, క సినిమాలు సైతం బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడో అందుకొని లాభాల బాట పడతాయి. కాగా ఈ శుక్రవారం సూర్యా కంగువ, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు విడుదల కావడంతో.. ఇక దీపావళి సినిమాల జోరు తగ్గుతుంది అనుకున్నారు అందరూ.
కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. సూర్యా కంగువ, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు.. రెండు కూడా డిజాస్టర్స్ డిజాస్టర్ టాక్స్ అందుకున్నాయి. సూర్య కంగువ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదల కాగా.. అసలు అర్థం కాని కథతో దర్శకుడు ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెట్టారంటూ మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకునింది. మరోపక్క వరుణ్ మట్కా చిత్రం పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ హీరో వరస క్లాపులతో సతమతమవుతూ.. ఉండటంతో ఈసారైనా సరైన విజయం వస్తుంది అని ఎదురు చూశాడు అయితే మట్కా చిత్రం మరింత డిజాస్టర్ వైపు పరుగులు తీసేతట్టు కనిపిస్తోంది. ఈ చిత్రం మెగా డిజాస్టర్ అంటూ ఇకనైనా వరుణ్ కథల గురించి శ్రద్ధ తీసుకుంటే.. బాగుంటుంది అంటూ సినిమా చూసినవారు అంటున్నారు.
ఇలా ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో.. మరోసారి దీపావళి సినిమాలకే ప్రేక్షకులు ఓటు వేసేటట్టు ఉన్నారు. కొన్ని థియేటర్స్ ఈవినింగ్ షోకే తిరిగి.. లక్కీ భాస్కర్, క చిత్రాలను వేసేస్తున్నాయి. కాబట్టి మరోసారి మీ రెండు చిత్రాలకి కలెక్షన్స్ పెరిగేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా 100 కోట్ల క్లబ్బులో అరుగుపెట్టగా.. క చిత్రం 50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. కిరణ్ అబ్బవరం క చిత్రం.. 48 కోట్ల గ్రాస్ సంపాదించినట్టు సమాచారం. కాబట్టి మరో వారం కూడా ఈ రెండు సినిమాలు కొనసాగితే.. ప్రొడ్యూసర్ల కి మరిన్ని లాభాలు తెచ్చి పెట్టడం ఖాయం.
Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామానికి వెళ్తాం.. ఎవడు ఆపుతాడో చూస్తాం: కేటీఆర్ సంచలనం
Also Read: Rashtrapati: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఎప్పుడు, ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి