Kanguva Movie Update: తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువా'(Kanguva). పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో శివ తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు డైరెక్టర్ గా పనిచేశారు. సూర్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఇవాళ అంటే జూలై 23న విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. శనివారం అర్ధరాత్రి 12:01 నిమిషాలకు ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక మనిషి‌, అడవి‌, కథ అంటూ సూర్య కళ్ల వరకు ఫేస్‌ను రివీల్‌ చేశారు. కత్తి కంటే కళ్లే పదునైనవి తెలుపుతూ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. 



Also Read: Varun Tej-Lavanya: వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?


ఈ సినిమాను పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నాడు. స్టూడీయో గ్రీన్‌ బ్యానర్‌తో కలిసి యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ సినిమానూ నిర్మిస్తుంది. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ నటిస్తోంది. ఈ చిత్రానికి  రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోలీవుడ్ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 


Also Read: SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook