Bhagavanth Kesari: ఇండస్ట్రీలో ఉన్న మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే నందమూరి బాలకృష్ణ మాత్రం వరుస విజయాలతో కెరీర్లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో మర్చిపోలేని విజయాలను అందుకున్న బాలకృష్ణ తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటిదాకా మాస్ సినిమాలలో నటించిన బాలకృష్ణ ని ఈ సినిమాలో ఒక విభిన్న యాంగిల్ లో చూపించబోతున్నట్లు అనిల్ రావిపూడి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా పైఅంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్ లో వైరల్ గా మారింది.


తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఒక ఫ్లాష్ బ్యాక్ భాగం కూడా ఉండబోతుందట. సెకండ్ హాఫ్ లో ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఉంటాయట. కానీ అనిల్ రావిపూడి ఆ ఫ్లాష్ ప్యాక్ లో ఎలాంటి కథ ఉంటుందని మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ పది నిమిషాల ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. బాలయ్య ను పోలీస్ ఆఫీసర్ యూనిఫారంలో చూసి చాలాకాలం అవడంతో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ పాయింట్ అవ్వబోతోందని కొందరు చెబుతున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్కి ముందు వస్తుందని తెలుస్తోంది. తల్లిదండ్రులు ఆడపిల్లలను ఎలా పెంచాలని ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ దీని గురించి కొన్ని కమర్షియల్ డైలాగ్లు కూడా చెప్పబోతున్నారట. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ భార్య పాత్రలో కనిపించని ఉండగా బాలయ్య మేనకోడలిగా యువ హీరోయిన్ శ్రీ లీల అందరి దృష్టిని ఆకర్షించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


Also Read: Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి