Bhagavanth Kesari Video: నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari ). మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీలో టాలీవుడ్ సెన్షేషన్ శ్రీలీల మరో కీలకపాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత థమన్-బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ ను ప్రకటించారు అనిల్ రావిపూడి. ''నందమూరి బాలకృష్ణ అండ్ టీంతో మెమొరబుల్‌ జర్నీ. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకు ఎప్పటికీ జ్ఞాపకంగా నిలిచిపోతుంది. రేపు సాయంత్రం 4:05 గంటలకు ఓ ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు'' అనిల్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో అనిల్ మానిటర్‌లో సీన్‌ చెక్ చేసుకుంటున్న ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. 



ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. భగవంత్ కేసరి చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 



Also Read: Eagle Movie: మొండోడు పండుగకు వస్తున్నాడు.. ఈగల్ రిలీజ్ డేట్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook