Dhanush SIR : భీమ్లా నాయక్, డీజే టిల్లు రేంజ్లో.. `సార్`పై నిర్మాత కామెంట్స్
Dhanush SIR Movie Success ధనుష్ సార్ మూవీ సక్సెస్ అయింది. మౌత్ టాక్ బాగానే ఉంది. రివ్యూలు సైతం పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో కలెక్షన్లు సైతం పెరిగే అవకాశాలున్నాయి. ధనుష్ సార్ మూవీ సక్సెస్ అవ్వడంతో తాజాగా దర్శక నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.
Dhanush SIR Movie Success ధనుష్ సార్ మూవీకి తెలుగులో మంచి టాక్ వచ్చింది. రివ్యూలు అన్నీ కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో మౌత్ టాక్ వల్ల ధనుష్ సార్ సినిమాకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. సినిమా హిట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు మీడియా ముందుకు వచ్చాడు. నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.
సినిమా హిట్ అవ్వడంతో చాలా ఆనందంగా ఉందని అన్నాడు. తనకు సంవత్సరం తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ ఫుల్ అని ఫోన్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యాడు. నిన్న ప్రీమియర్లకు మంచి టాక్ రావడంతో.. చిన్న చిన్న ఏరియాలలో కూడా మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. షో షోకి వసూళ్ళు పెరుగుతున్నాయని పేర్కొన్నాడు.
గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన భీమ్లా నాయక్, డీజే టిల్లు సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయని గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు సార్ సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని గాల్లో తేలిపోయాడు నాగ వంశీ. మొదటగా ఒకట్రెండు ప్రీమియర్‌లు వేద్దామని అనుకున్నారట.
ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. షోలను పెంచుకుంటూ పోయామని, ఒక్క హైద్రాబాద్‌లోనే 2 షోలు పడ్డాయని తెలిపాడు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 40 షోలు వేశామని అన్నాడు. ధనుష్ చేసిన రఘువరన్ బి.టెక్ సినిమాకు తెలుగులో టోటల్ రన్ ఎంత వచ్చిందో.. ఇప్పుడు సార్ సినిమాకు ఒక్క రోజులోనే వచ్చిందని లెక్కలు కూడా చెప్పేశాడు.
సినిమా హిట్ అవ్వడంతో చాలా సంతోషమేసిందని, 2018 లో వచ్చిన తన మొదటి సినిమా తొలిప్రేమ తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరి నుంచి ఫోన్లు వస్తున్నాయని వెంకీ అట్లూరి గుర్తు చేసుకున్నాడు. ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయానని, ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చానని చెప్పుకొచ్చాడు. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారని ఎమోషనల్ అయ్యాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి.
Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook