వైరల్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి INSTAGRAM POST
Sushant Singh Rajput suicide news | సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ఆయన అభిమానులను, సన్నిహితమిత్రులను బాలీవుడ్ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి కారణమై ఏమై ఉంటుందా అని ఆరా తీస్తున్న అభిమానులు.. అతడు చివరిగా సోషల్ మీడియాలోనైనా ఏమైనా రాసుకొచ్చాడా అనే కోణంలో వెతకడం ప్రారంభించారు.
Sushant Singh Rajput suicide news | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ఆయన అభిమానులను, సన్నిహితమిత్రులను బాలీవుడ్ ప్రముఖులను ( Bollywood celebs) తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారణమై ఏమై ఉంటుందా అని ఆరా తీస్తున్న అభిమానులు.. అతడు చివరిగా సోషల్ మీడియాలోనైనా ఏమైనా రాసుకొచ్చాడా అనే కోణంలో వెతకడం ప్రారంభించారు. అప్పుడు కనబడింది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారిగా చేసిన ఈ పోస్ట్ (Sushant Singh Rajput`s last post on instagram). అయితే, ఇదేమీ సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి ముందు చేసిన పోస్ట్ కాదు.. జూన్ 3న తన తల్లిని స్మరించుకుంటూ చేసిన పోస్ట్ ఇది. 2002లో తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకుంటూ సుశాంత్ ప్రేమతో పెట్టిన ఈ ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం అతడి ఆత్మహత్య నేపథ్యంలో వైరల్‌గా మారింది. అమ్మపై ప్రేమతో సూశాంత్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు అభిమానులను, నెటిజెన్స్‌ని మరింత ఆకట్టుకుంటోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్స్‌కుపైగా ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పటికే ఒక మిలియన్‌కిపైగా నెటిజెన్స్ ఈ పోస్టుని లైక్ చేశారు. ఇంకొన్ని వేల మంది షేర్ చేసుకోగా.. ఇంకెంతో మంది అభిమానులు ఈ పోస్టుపై కామెంట్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..