Sushmita Sen Advice on Heart Attacks: ఈ మధ్య కాలంలో వస్తున్న హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటి వార్తలు చూస్తుంటే అందరికీ వెన్నులో వణుకు పుడుతోంది. ఇలా అనుకోకుండా ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వారు మరణిస్తూ ఉండడం చర్చనీయాంశం అవుతుంది ఇక తాజాగా సేన్ కి కూడా హార్ట్ ఎటాక్ రావడం ఆ తర్వాత ఆమె హాస్పిటల్ కి తరలించడం రెండు రోజుల తర్వాత ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు ఎవరికీ తెలియకపోవడం చర్చినీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక రకంగా చెప్పాలంటే సుష్మితా సేన్ కి 47 ఏళ్లు. మిగతా సాధారణ గృహిణులతో పోలిస్తే ఆమె చాలా ఫిట్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు జిమ్ చేయడం సహా అనేక రకాల డైట్ ప్లాన్లు మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే నిజానికి సాధారణంగా ఆడవాళ్ళలో హార్ట్ అటాక్ సమస్యలు తక్కువ అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఇన్ని లెక్కలను బట్టి చూస్తే సుష్మితా సేన్ కి గుండెపోటు వచ్చిందని అంటే ఆశ్చర్య పడక తప్పదు. అయితే ఆమెకు ఫిట్నెస్ వల్లనే ఈ గుండెపోటు వచ్చిందేమో అని అనుకుంటుంటే కాదు తాను ఈ ఫిట్ నెస్ వల్లే తాను బతికి బయటపడ్డాను అంటోంది సుస్మిత.


తనకు గుండెపోటు వచ్చిన సమయంలో రక్తనాళాలు మూసుకు పోయిన మాట వాస్తవమే కానీ నిత్యం ఎక్సర్ సైజ్ చేయడం వల్లే స్టెంట్ తో సరిపోయింది అని ఆమె చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ నిత్యం రన్నింగో, వాకింగో, యోగానో, ఏదో ఒక వ్యాయామం చెయ్యాలి అని ఆమె మిగతా మహిళలందరికీ సలహా ఇస్తోంది.


చాలామంది, ఎప్పుడూ ఎక్సర్ సైజ్ చేసే సుష్మితకే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇక జిమ్ కి ఎందుకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నారు కానీ అది తప్పు. నేను ఫిట్ గా ఉండడం వల్లే తొందరగా కోలుకున్నాను అని సుస్మిత పేర్కొంది. ఇదే కాదండోయ్ సుస్మిత అందరూ ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకోవాలి అని కూడా సలహా ఇస్తోంది. ఇలా ముందస్తు ఈ చెకప్లు చేయించడం వలన ముందే సమస్యని పసిగట్టే అవకాశం ఉందని చెప్తోంది సుష్మిత సేన్.
Also Read: Ram Gopal Varma Uncle: రామ్ గోపాల్ వర్మ ఇంట తీవ్ర విషాదం..పరామర్శించిన అల్లు అర్జున్!
Also Read: Pragya Jaiswal Photos: డెనిమ్ షార్ట్, జాకెట్లో ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్.. రెండిటి బటన్స్ విప్పేస్తూ టీజింగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి