Aarya 2 trailer: ఆర్య 2 ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో ఆర్య వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రామ్ మధ్వాని డైరెక్ట్ చేసిన ఆర్య 2 వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఆర్య 2 ట్రైలర్‌కి ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఏడాది క్రితం రిలీజైన ఆర్య తొలి వెబ్ సిరీస్‌కి ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్ రాగా.. ఆర్య 2 ట్రైలర్‌కి రిలీజైన 10 రోజుల్లోనే 31 మిలియన్ల వ్యూస్ లభించాయి. దీంతో ఆర్య 2 వెబ్ సిరీస్ యూనిట్ హర్షం వ్యక్తంచేస్తోంది. ఇదే విషయమై మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. ఆర్య 2 వెబ్ సిరీస్ ట్రైలర్‌ని (Aarya 2 trailer video) ఆదరిస్తున్న అభిమానులకు తనదైన స్టైల్లో కృతజ్ఞతలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Health tips: గుడ్డుతో పాటు ఈ ఆహారపదార్థాలు కలిపి తింటే.. ఇక అంతేనట!


ఆర్య 2 వెబ్ సిరీస్‌లో చీకటి నేర ప్రపంచంలో శత్రువులను ఎదుర్కొనే సాహసోపేతమైన ఓ తల్లి పాత్రలో సుష్మితా సేన్ కనిపించనుంది. ఈ పోరాటంలో ఆమెకు తన కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందా లేక తాను నమ్మిన వారే ఆమెను మోసం చేస్తారా అనేదే ఆర్య 2 కథాంశంగా ఉండనుందనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సుష్మితా సేన్‌తో పాటు (Sushmita Sen) సికందర్ ఖేర్, వికాస్ కుమార్, మయో సరావో, అంకుర్ భాటియా, ఆకాష్ ఖురానా, దిల్నాజ్ ఇరాని తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.



డచ్‌లో తెరకెక్కిన పెనోజా అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆధారంగా ఆర్య 2 వెబ్ సిరీస్ (Aarya 2 Web series trailer) రూపొందింది. ఫేమస్ ఓటిటి ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (Disney+ Hotstar) డిసెంబర్ 10 నుంచి ఆర్య 2 వెబ్ సిరిస్ ఆడియెన్స్‌కి అందుబాటులో ఉండనుంది. రామ్ మధ్వాని, ఎండెమొల్ షైన్ ఇండియా సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ని కో ప్రొడ్యూస్ చేస్తున్నాయి.


Also read : Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook